కరోనాతో ప్రముఖ తెలుగు ప్రొడ్యూసర్ మృతి

కరోనా బారినపడి సినీ నిర్మాత పోకూరి రామారావు మృతిచెందారు. టాలీవుడ్ కు చెందిన పోకూరి రామారావు (64)కరోనా బారినపడి.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం ఉదయం కన్నుమూశారు. కొన్ని రోజుల క్రితం ఆయనకు కరోనా సోకడంతో కాంటినెంటల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా.. శనివారం ఆయన ఆరోగ్యం మరింత క్షీణించడంతో ఉదయం 9 గంటలకు చనిపోయారు.

ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ త‌రం ఫిలింస్ అధినేత పోకూరి బాబూరావు సోద‌రుడే పోకూరి రామారావు. ఈ బ్యానర్ లో వచ్చిన పలు సినిమాలకు రామారావు సమర్పకుడిగా వ్యవహరించారు. పోకూరి రామారావు మరణవార్తతో టాలీవుడ్ ఇండస్ట్రీలో విషాధచాయలు అలుముకున్నాయి. పలువురు సీనియర్ నటులు, ప్రముఖులు ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు.

For More News..

వాటర్ ట్యాంకర్ లో కాళ్లు కడుకున్న డ్రైవర్.. వీడియో వైరల్

సినిమాలు లేక కిరాణ కొట్టు పెట్టుకున్న దర్శకుడు

అందరికీ నార్మాల్ మాస్క్.. ఈయనకు మాత్రం గోల్డ్ మాస్క్

Latest Updates