ఝాన్సీ ఆత్మహత్య కేసు: విచారణ స్పీడప్

టీవీ నటి ఝాన్సీ ఆత్మహత్య కేసులో పోలీసులు విచారణను స్పీడప్ చేశారు. ఇప్పటికే ఝాన్సీ తల్లి అన్నపూర్ణ వాగ్మూలం రికార్డు చేసుకున్నారు. సూర్యను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు పంజాగుట్ట ఏసీపీ విజయ్ కుమార్. ఝాన్సీకి చెందిన రెండు సెల్ ఫోన్లు స్వాదీనం చేసుకున్నారు. అందులో ఒకటి ఓపెన్ అయిందని..మరోటి ఓపెన్ కావడం లేదన్నారు. అన్ని కోణాల్లో విచారణ జరిపి.. త్వరలోనే నిందితులు ఎవరో తేలుస్తామన్నారు ఏసీపీ విజయ్.

Latest Updates