అమెరికాలో అరెస్టయిన స్టూడెంట్స్ రిలీజ్

  • ‘ఫార్మింగ్టన్’ కేసు .. మన స్టూడెంట్లకు ఊరట
  • 26లోగా ఇండియాకు వెళ్లాలన్న అమెరికా కోర్టు

అమెరికాలో మోసపోయిన తెలుగు విద్యార్థులు స్వదేశం వచ్చేందుకు అమెరికా కోర్టు అనుమతిచ్చింది. ఈ నెల 26వ తేదీలోగా
స్వచ్ఛందంగా తిరిగి వెళ్లాలని కోర్టు ఆదేశించింది. వీరిలో ఎనిమిది మంది తెలుగువారు ఉన్నారు.

హైదరాబాద్: ఫార్మింగ్టన్​ యూనివర్సిటీ కేసులో అరెస్టు అయిన 16 మంది విద్యార్థులకు ఊరట దక్కింది. ఈ నెల 26లోగా వారు స్వచ్ఛందంగా స్వదేశాలకు తిరిగి వెళ్లేందుకు అమెరి కా కోర్టు అనుమతిచ్చింది. ఈ కేసులో అరెస్ట్ అయిన వారంతా కేలహోన్ కౌంటీ, మన్రో కౌంటీ జైళ్లలో ఉన్నారు. మొత్తం 20 మంది అరెస్టు కాగా.. ముగ్గురి కి గతంలోనే వాలంటరీ డిపార్చర్ అనుమతి లభించిం ది. ఆ ముగ్గురి లో ఇద్దరు భారతీయులు, ఒకరు పాలస్తీనియన్. మిగిలిన 17 మందిపై మంగళవారం కోర్టులో తుది వాదనలు ముగిశాయి. ఈ 17 మందిలో 15 మంది స్వచ్ఛందంగా స్వదేశాలకు వెళ్లేందుకు కోర్టు అవకాశం కల్పించిం ది. ఈ 15 మందిలో 8 మంది తెలుగు విద్యార్థులే. 16వ విద్యార్థికి కూడా తిరిగి వెళ్లిపోయే అవకాశం ఇచ్చినా స్వచ్ఛందంగా కాకుం డా యూఎస్ గవర్నమెంట్ రిమూవల్ కింద అనుమతించింది.
ఇక 17వ విద్యార్థి అమెరికా పౌరసత్వం ఉన్న మహిళను పెళ్లి చేసుకోవడంతో అతను బెయిల్ బాండ్ కోసం అప్పీలు చేసుకున్నాడు. అతను మినహా మిగతా 16 మంది కోర్టు తీర్పు మేరకు ఈ నెల 26లోగా అమెరి కా వదిలి వెళ్లాల్సి ఉంటుం ది. మరోవైపు కోర్టు ఆదేశాలతో విద్యార్థులంతా స్వదేశాలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు . వీరి తిరుగు ప్రయణానికి అవసరమైన ఏర్పా ట్ల విషయంలో సహకరిం చాలని అమెరికన్ తెలంగాణ అసోసియేషన్(ఆటా- తెలంగాణ) ప్రతినిధులు ఇమిగ్రేషన్ అధికారులను కోరారు. దీనిపై వారు సానుకూలంగా స్పందించినట్టు తెలిసింది. తిరుగు
పయాణమయ్యేందుకు టికెట్ల బుకిం గ్ టైమింగ్.. జైలు, ఇమిగ్రేషన్ అధికారులకు విద్యార్థులు ముందే తెలియజేయాల్సి ఉంటుంది. ఆ మేరకు ఇమిగ్రేషన్ అధికారులు విద్యార్థులను జైళ్ల నుంచి ఎయిర్ పోర్టుకు చేర్చే ఏర్పాట్లు చేస్తారు.
కాంగ్రెస్ సభ్యురాలు ఎలిసా మద్దతు
ఫార్మింగ్టన్​ఫేక్​యూనిర్సిటీ వ్యవహారంలో తెలుగు విద్యార్థులకు అమెరి కన్ తెలంగాణ అసోసియేషన్(ఆటా- తెలంగాణ) అండగా నిలిచింది. విద్యార్థుల తరపు న వాదించేం దుకు అటార్నీలను ఏర్పాటు చేసింది. విచారణ ఎదుర్కొంటున్న విద్యార్థులకు సహకారం అందిం చాలని కాంగ్రెస్ సభ్యురాలు ఎలిసా స్లాటికిన్‌ కు వెం కట్ మంతెన ఆధ్వర్యంలో ఆటా- తెలంగాణ ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన ఎలిసా స్లాటికిన్.. విద్యార్థులకు పూర్తిగా సహకరిం చాలని ఇమిగ్రేషన్, కస్టమ్స్ ఎన్​ఫోర్స్ మెంట్ తో పాటు ఇండియన్ ఎంబసీ, హోంల్యాండ్​ సెక్యూరిటీ అధికారులకు లేఖలు రాశారు. అమెరికా లోని భారతీయులకు కూడా ఎలిసా ఒక లేఖ రాశారు. తాము ఎన్​రోల్​అవుతున్న యూనివర్సిటీ ఫేక్​అని ఆ
విద్యార్థులకు తెలియదని, ఫారిన్​ వర్క్​ స్టడీ ప్రోగ్రామ్ ను తప్పుగా అర్థం చేసుకోవడం వల్లే వారంతా ఇబ్బందుల్లో పడ్డారని ఆమె పేర్కొన్నారు . అరెస్ట్​ అయిన విద్యార్థుల విడుదలపై సానుకూలంగా స్పందించి న ఎలిసా.. వారిపై క్రిమినల్​ చర్యలు తీసుకోబోరని తాను ఆశిస్తున్నట్టు చెప్పారు.

Latest Updates