ఢిల్లీలో తెలుగు,తమిళ రైతులు: నామినేషన్లపై ECకి ఫిర్యాదు

ఢిల్లీ : వారణాసి లోక్ సభ నియోజకవర్గంలో నామినేషన్లు తిరస్కరించడంతో ఢిల్లీకి చేరుకున్నారు తెలంగాణ, తమిళనాడు రైతులు. సరైన కారణాలు చూపకుండానే తమ నామినేషన్లను తిరస్కరించారంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి కంప్లయింట్ చేశారు. వారణాసి రిటర్నింగ్ అధికారి తీరుపై ఫిర్యాదు చేశామని రైతులు చెప్పారు.

“ప్రధానిపై పోటీ చేయనివ్వలేదు. ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు. కావాలనే అధికారులు 24 మంది రైతుల నామినేషన్లను తిరస్కరించారు. ఆఖరికి నామినేషన్ పత్రాలు ఇవ్వడంలో కూడా తీవ్రమైన ఆలస్యం చేశారు. స్థానిక బీజేపీ నేతలు, రైతులు దాఖలు చేసిన నామినేషన్ పత్రాలలోని ప్రపోసర్స్ నంబర్లకు ఫోన్ చేసి బెదిరించి వారితో మద్దతు ఉపసంహరించేలా చేశారు. పోలీసులు అడుగడుగునా మమ్మల్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. మాకు జరిగిన అన్యాయాన్ని ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్తాం. ప్రజాస్వామ్య దేశంలో ఎవరు ఎక్కడినుంచైనా పోటీచేసే హక్కు ఉంటుంది. మా హక్కులను కాలరాసేలా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలి” అని అన్నారు పసుపు బోర్డ్ రైతు నాయకులు.

Latest Updates