తెలుగు టైటాన్స్ గెలిచిందోచ్

అహ్మదాబాద్: ప్రొ కబడ్డీ సీజన్–7లో  తెలుగు టైటాన్స్ ఎట్టకేలకు విజయం సాధించింది. ఆదివారం జరిగిన మ్యాచ్‌‌లో టైటాన్స్​30–-24తో గుజరాత్​ ఫార్చున్​జెయింట్స్‌‌పై  నెగ్గి ఈసీజన్‌‌లో తొలి విజయాన్ని నమోదు చేసింది.  భారీ అంచనాలతో జట్టులోకి వచ్చిన  సిద్దార్థ్​ దేశాయ్​7 రైడింగ్ పాయింట్లతో  స్థాయి తగ్గ ప్రదర్శన కనబర్చగా.. స్టార్​ ఢిఫెండర్​విశాల్ భరద్వాజ్​7 ట్యాకిల్ పాయింట్లతో రాణించాడు.  మ్యాచ్ ప్రారంభం నుంచే ఆధిపత్యం కనబర్చిన టైటాన్స్..  ఫస్టాఫ్​ ముగిసే సరికి 17–-13తో ఆధిక్యంలోకి వెళ్లింది.  టై మ్యాచ్ అనుభవం దృష్ట్యా  తప్పిదాలు చేయకుండా  జాగ్రత్తగా ఆడిన టైటాన్స్ చివర్లోనూ జోరు చూపెట్టి తనదైన శైలిలో మ్యాచ్‌‌ను ముగించింది.  గుజరాత్‌‌ టీమ్‌‌లో రోహిత్​ గులియా 5 రైడ్ పాయింట్లు, పర్వేశ్ 7 ట్యాకిల్​ పాయింట్లతో రాణించారు.

హర్యానా జోరు..

హోరాహోరిగా సాగిన మరో మ్యాచ్‌‌లో హర్యానా స్టీలర్స్​ 33–30తో  బెంగళూరు బుల్స్‌‌పై గెలిచింది. హర్యానాలో వికాస్​కందోలా 11 రైడ్ పాయింట్లతో సూపర్–10 సాధించగా..  ఢిఫెండర్​ వికాస్ కాలే 6 ట్యాకిల్​పాయింట్లతో రాణించాడు. బెంగళూరు కెప్టెన్​రోహిత్​కుమార్​ (10 రైడింగ్,2 ట్యాకిల్) పాయింట్లతో చెలరేగినా… డిఫెన్స్‌‌ అనుకున్న స్థాయిలో అతనికి సహకరించలేదు.

Latest Updates