బుల్లితెర నటి శ్రావణి ఆత్మహత్య

తెలుగు టీవీ సీరియల్ నటి కొండపల్లి శ్రావణి ఆత్మహత్యకు పాల్పడింది. SR నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మధుర నగర్ నగర్ లోని  హెచ్ 56 బ్లాక్  సెకండ్ ఫ్లోర్ లో నివసిస్తున్న శ్రావణి మంగళవారం అర్థరాత్రి  ఉరివేసుకుంది. కాకినాడ గొల్లప్రోలుకు చెందిన దేవరాజు రెడ్డితో శ్రావణికి టిక్ టాక్ లో పరిచయం ఏర్పడింది. అతని వేధింపులు తట్టుకోలేకే ఆత్మహత్యకు పాల్పడిందని ఆమె కుటుంబ సభ్యులు చెబుతున్నారు. దేవరాజు రెడ్డి అలియాస్ సన్నీ పై SR నగర్ పోలీస్ స్టేషన్ లో  శ్రావణి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు SR నగర్ పోలీసులు. మృతదేహాన్నీ పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. తన అక్క చావుకి కారణమయిన దేవరాజ్ రెడ్డిని కఠినంగా శిక్షించాలని మృతురాలి తమ్ముడు శివ డిమాండ్ చేశాడు. గత ఎనిమిది సంవత్సరాల నుండి టీవీ సీరియల్ లో మౌన రాగం, .మనసుమమత వంటి పలు సీరియల్ లో నటిస్తుంది శ్రావణి.

 

 

Latest Updates