వెదర్ అలర్ట్ : ఇవాళ, రేపు ఎండలు పెరిగే సూచన

రాష్ట్ర వ్యాప్తంగా పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని, ఇక నుంచి ఎండలు ముదిరే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. శుక్రవారం నుంచి మూడ్రోజుల పాటు పోడి వాతావరణ పరిస్థితులు ఉంటాయని తెలిపింది. పగలు ఎండ, రాత్రి వేళల్లో చలి తీవ్రత కొనసాగుతుందన్నారు వాతావరణ కేంద్రం అధికారులు. పగటి ఉష్ణోగ్రతలు అన్ని ప్రాంతాల్లోనూ 30 డిగ్రీల పైనే నమోదవుతున్నాయి. అత్యధికంగా నిజమాబాద్, మహబూబ్ నగర్ లలో 34 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇవాళ, రేపు ఎండ తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో చలి తీవ్రత తగ్గుతుండగా.. ఎండ తీవ్రత పెరుగుతుంది. తెల్లవారు జామున కొంత చలిగానే ఉంటుంది. పొగ మంచు కొనసాగుతుంది. నిన్న గ్రేటర్ లో గరిష్ట ఉష్ణోగ్రత సాధారణ స్థాయి కంటే ఒక డిగ్రీ సెల్సియస్ పెరిగి 32 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 19.3 డిగ్రీలు నమోదైంది.

Latest Updates