చలి కాస్త తగ్గింది : గిన్నెదారిలో 14.2 డిగ్రీలు

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: రాష్ట్రంలో చలి తీవ్రత తగ్గుతోంది. రెండు రోజుల్లో నాలుగు డిగ్రీల మేర కనిష్ట ఉష్ణోగ్రతలు పెరిగాయి. ఉదయం పూట మాత్రం పొగమంచు ఎక్కువగా ఉంటోంది. శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు కుమ్రంభీం జిల్లాలోని గిన్నెదారిలో 14.2డిగ్రీల కనిష్ట
ఉష్ణో గ్రత నమోదైంది. సంగారెడ్డి జిల్లా సాత్వారాలో 14.8, ఆదిలాబాద్‌ జిల్లా సోనాలా, కుమ్రంభీం జిల్లా బీబీపేటలలో 15.1 డిగ్రీల చొప్పున టెంపరేచర్లు రికార్డయ్యాయి.

Latest Updates