హర్యానా, రాజస్థాన్ లో తీవ్రంగా పడిపోయిన ఉష్ణోగ్రతలు

చలిగాలుల తీవ్రతతో ఉత్తర భారతం గజగజా వణుకుతోంది. రాత్రి ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి. హర్యానా, రాజస్థాన్ లలోని కొన్ని ప్రాంతాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు సున్నా డిగ్రీలకు పడిపోయాయి. జమ్మూ కశ్మీర్, లఢఖ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ లలో పలు ప్రాంతాలు మంచుతో కప్పుకుపోయాయి. దారుణంగా పడిపోయిన ఉష్ణోగ్రతలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

పశ్చిమ హిమాలయాల నుంచి వీస్తున్న శీతల గాలులు ఎముకలు కొరికేంత చలి పుట్టిస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో కూడా ఉష్ణోగ్రతలు 3.6 డిగ్రీలకు పడిపోయాయి. న్యూ ఇయర్ వేడుకలు జరుపుకునే సమయంలో ఉష్ణోగ్రతలు మరింత పడిపోయే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

Latest Updates