ఐస్ లా అలస్కా.. మైనస్ 60 డిగ్రీలు

  • రికార్డు స్థాయిలో టెంపరేచర్‌ నమోదు
  • పది రోజులుగా సున్నా దాటట్లేదు
  • నార్త్‌‌ ఇండియా గజగజ
  • ఢిల్లీలో భారీగా పొగమంచు

అలాస్కా టెంపరేచర్ రికార్డు స్థాయికి పడిపోయింది.. పది రోజులుగా అక్కడ చాలాచోట్ల టెంపరేచర్సున్నా డిగ్రీలను దాటడంలేదు. పగటి, రాత్రి ఉష్ణో గ్రతలలోనూ పెద్దగా తేడా కనిపించడంలేదని అధికారులు చెప్పారు. బీటిల్స్ లో శనివారం ఉదయంఏకంగా మైనస్ 56 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది.ఇది దాదాపుగా అంగారకుడి (మార్స్ ) ఉపరితలంపైనమోదయ్యే సగటు ఉష్ణో గ్రతకు సమానం. అలాస్కాలోని చాలా ప్రాంతాల్లో మైనస్‌ 60 డిగ్రీల దాకా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని అధికారులు చెప్పారు. కొన్నిరోజులుగా మైనస్ 40 డిగ్రీల టెంపరేచర్ కామన్ గామారిందని స్థా నికులు చెబుతున్నారు. అల్లాకాకెట్‌ లోకూడా శుక్రవారం మైనస్ 60 డిగ్రీల టెంపరేచర్నమోదైంది. అలాస్కాకు పశ్చిమాన అధిక పీడనం,తూ ర్పున అల్పపీడనాలు ఏర్పడ్డాయి. ఈ రెండువాతావరణ వ్యవస్థల మధ్య ఆర్కిటిక్‌ నుంచి నిరంతరాయంగా గాలులు వీయడంతో చలి పెరిగింది.ఆకాశం కూడా క్లియర్‌‌‌‌గా ఉండటంతో ఉష్ణో గ్రతలుభారీగా పడిపోయాయి.

అలాస్కాలోని కొట్జీబూలో–15 డిగ్రీలు, అంక్ టువుక్‌ పాస్‌‌లో –27, యునైటెడ్‌స్టేట్స్‌‌ నార్త్‌ మోస్ట్‌‌ కమ్యూనిటీలో – 11 డిగ్రీల టెంపరేచర్‌‌‌‌ నమోదైందని అధికారులు చెప్పారు. వీకెండ్‌ లోటెంపరేచర్ కాస్త మెరుగుపడే అవకాశం ఉందని,కొత్త సంవత్సరంలో అడుగుపెట్టే టైంకి వాతావరణం అనుకూలంగా మారుతుందని వాతావరణ నిపుణులుచెప్పారు. వాస్తవానికి అలాస్కాలో టెంపరేచర్ పడిపోవడం కొత్తేమీ కాదు.. ఏడాదిలో కనీసం 11 రాత్రులుమైనస్ 40 డిగ్రీల ఉష్ణో గ్రతలు నమోదవుతాయి.పంజాబ్‌ , హర్యానాల్లోనూ ..పంజాబ్‌ , హర్యానాల్లో నూ శనివారం టెంపరేచర్లుభారీగా పడిపోయాయి. పొగమంచు కారణంగాప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు . రెండు రాష్ట్రా ల్లోహిస్సార్‌‌‌‌ 0.2 డిగ్రీల సెల్సి యస్‌‌తో కోల్డెస్ట్‌‌ ప్లేస్‌‌గా రికార్డుకెక్కింది. నార్నౌల్‌‌లో 0.5, రోహ్ తక్‌ లో 1.8, కర్నాల్‌‌లో 1.5, సిర్సాలో 2, భటిండాలో 2.3, భివానీలో3.9 డిగ్రీల సెల్సి యస్‌‌ ఉష్ణో గ్రత నమోదైంది. దీంతోచాలా చోట్ల రైళ్లు, ఫ్లైట్‌ సర్వీసులకు అంతరాయంఏర్పడిం ది. హిమాచల్‌‌ ప్రదేశ్‌ లో సబ్‌ జీరో టెంపరేచర్లు నమోదయ్యాయి. కుఫ్రీ, మనీలా, సోలన్‌‌,భున్‌‌టార్‌‌‌‌, సుందర్‌‌‌‌నగర్‌‌‌‌, సియోభాగ్‌ , కల్పాల్లోసబ్‌ జీరో టెంపరేచర్లు ఉన్నాయి. కీలాంగ్‌ లో మైనస్11.5 డిగ్రీల సెల్సి యస్‌‌ నమోదైందని అధికారులుచెప్పారు.

Latest Updates