బాబు హయాంలో ఆలయాలకు రక్షణ లేదు

ఏపీ సీఎం చంద్రబాబు పాలనలో దేవాలయాలకు రక్షణ లేకుండా పోయిందన్నారు YCP MP విజయసాయిరెడ్డి. ప్రెస్ మీట్ లో మాట్లాడిన ఆయన…అనేక దేవాలయాలు, మసీదులు, చర్చిలను కూలగొట్టారన్నారు. దేవుడి సొమ్మును కాజేసే నీచబుద్ధి చంద్రబాబుది అని ఆరోపించారు. సదావర్తి భూములను ఎందుకు అమ్మాల్సి వచ్చింది?… TTD బంగారం విషయంలో బాబు ఎందుకు స్పందించడం లేదన్నారు. టీటీడీ ప్రధాన అర్చకులను తొలగించారని, యనమల వియ్యంకుడిని టీటీడీ చైర్మన్ గా నియమించారని, దొంగతనం, దోపిడీ చేయడానికే ఇవన్నీ చేశారన్న విషయం స్పష్టంగా అర్థమవుతోందన్నారు.

చంద్రబాబు హయాంలో ఐదుగురు సీఎస్ లుగా పని చేస్తే, ముగ్గురు CS లు ఆయన పనితీరును వ్యతిరేకించారన్నారు. గోవిందరాజస్వామి ఆలయంలో కిరీటాలు మాయమయ్యాయని… ఏ ఇంట్లో సోదా చేస్తే ఆ కిరీటాలు దొరుకుతాయో పోలీసులకు తెలుసన్నారు. ఇద్దరు జేబుదొంగలను పట్టుకుని వారే కిరీటాలు దొంగిలించారంటూ…ఆ కేసును పక్కదారి పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు.

Latest Updates