
వైసీపీ నాయకులు ఆలయాలను రాజకీయ పునరావాస కేంద్రాలుగా మార్చుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్. దేవాలయ భూములను హౌసింగ్‌కు ఇవ్వడాన్ని వ్యతిరేకించామన్నారు. అనువంశిక వ్యవస్ధను YCP ప్రభత్వం పక్కన పెట్టిందన్నారు. పోలీసులు YCP కార్యకర్తలుగా మారిపోయారని ఆరోపించారు. ఎప్పుడూలేని తరహాలో పోలీస్ స్టేషన్లలో సెవిూ క్రిస్టమస్ వేడుకలు చేయడంలో అర్థం ఏంటని ప్రశ్నించారు. దేవలయాలపై దాడులను రాజకీయం చేయాల్సిన అవసరం బీజేపీకి లేదన్నారు మాధవ్.