బద్రీనాథ్ హైవేపై ప్రమాదం: ఐదుగురు మృతి

బద్రీనాథ్ యాత్రలో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు మృతిచెందారు. ఇది బద్రీనాథ్ హైవే ‘తీన్ ధారా’వద్ద జరిగింది. బద్రీనాథ్‌కు వెళ్తున్న యాత్రికుల టెంపో దేవ్ ప్రయాగ్‌పై నుంచి వెళ్తుడగా.. కొండపై నుంచి ప్రమాదవశాత్తు బండరాళ్లు జారి టెంపోపై పడ్డాయి. దీంతో టెంపో బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా.. మరో ఐదుగురు గాయపడ్డారు. ప్రయాణికులంతా పంజాబ్‌లోని మొహాలికి చెందినవారిగా పోలీసులు తెలిపారు. టెంపో నెంబర్ PB01A 7524. ప్రమాద విషయం తెలుసుకున్న వెంటనే SDRF టీం సంఘటనా స్థలానికి చేరుకుని.. బోల్తాపడిన టెంపోలోనుంచి గాయపడిన వారిని హాస్పిటల్‌కు తరలించారు.

Latest Updates