ఖైదీలకు కరోనా సోకకుండా తాత్కాలిక బెయిల్, పెరోల్

కరోనాను కట్టడి చేసే ప్రయత్నంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో వివిధ జైళ్లలో ఉన్న ఖైదీలకు కరోనా సోకకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఖైదీలకు తాత్కాలిక ఉపశమనం కల్పించేనున్నట్లు తెలుస్తోంది. తాత్కాలిక బెయిల్,పెరోల్ పై ఖైదీల ని విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. విడుదలయ్యేందుకు అర్హత ఉన్న ఖైదీల గుర్తింపునకు ముగ్గురు అధికారులతో హై పవర్ కమిటీని ఏర్పాటు చేసింది ఏపీ సర్కారు.

Latest Updates