డ్రైవర్ నిర్లక్ష్యం.. కాలు కోల్పోయిన కండక్టర్

ఆర్టీసీ సమ్మె కారణంగా  ప్రజలు పడుతున్న ఇబ్బందులు, తాత్కాలిక సిబ్బంది వల్ల జరుగుతున్న ప్రమాదాలు రాష్ట్రంలో ఇప్పటికే పలు చోట్ల చోటుచేసుకున్నాయి. తాజాగా తాత్కాలిక సిబ్బంది డ్రైవింగ్ వల్ల  ఆ సిబ్బందిలోనే కండక్టర్ గా పనిచేస్తున్న వ్యక్తి ప్రమాదానికి గురయ్యాడు. విధులు నిర్వహించేందుకు వచ్చి అవిటి వాడయ్యాడు.

నల్గొండ జిల్లా మిర్యాలగూడ బస్టాండ్ లో సోమవారం ఉదయం ఓ డ్రైవర్ అజాగ్రత్తగా బస్సు నడపడం వల్ల ఓ కండక్టర్ కి ప్రమాదం జరిగింది.ఆ కండక్టర్ పాదం మీదం నుంచి ఆర్టీసీ బస్సు వెళ్లడంతో అతని పాదం పూర్తిగా నుజ్జునజ్జయింది. డ్రైవర్ నిర్లక్ష్య డ్రైవింగ్ ను గమనించిన అక్కడున్న ప్రయాణీకులు కండక్టర్ ను ప్రమాదం తప్పించబోయారు. కానీ బస్సు వేగంగా రావడంతో  ప్రమాదంలో అతని ఎడమ కాలి పాదం నుజ్జునజ్జయింది. ఆ కండక్టర్ ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

Latest Updates