మంచిర్యాలలో మహిళా కండక్టర్ పై డ్రైవర్ అఘాయిత్యం

మంచిర్యాల జిల్లా:  ఆర్టీసీ సమ్మె కారణంగా సరైన రవాణా సౌకర్యం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విధుల్లోకి చేరని ఆర్టీసీ కార్మికుల స్థానంలో తాత్కాలిక సిబ్బంది నియామకం చేసింది ప్రభుత్వం.  అనుభవ లోపం, క్రమశిక్షణ లేని ఆ సిబ్బంది వల్ల రాష్ట్రంలో కొన్ని చోట్ల ప్రమాదాలు జరిగాయి.  రెండు వేర్వేరు ఘటనల్లో ఇద్దరు వ్యక్తులు కూడా మరణించారు. అయితే తాజాగా ఆ సిబ్బందికి చెందిన ఓ డ్రైవర్.. విధుల్లో ఉన్న మహిళా కండక్టర్ పై అనుచిత ప్రవర్తనకి పాల్పడ్డాడు.

మంచిర్యాల ఆర్.టీ.సీ డిపో పరిధిలో ఓ తాత్కాలిక డ్రైవర్  (శ్రీనివాస్) తోటి సిబ్బందిపైనే అఘాయిత్యానికి ఒడిగట్టాడు. గురువారం రాత్రి చెన్నూరు నుండి మంచిర్యాల వెళుతున్న బస్సులో తాత్కాలిక మహిళా కండక్టర్ పై ఆ డ్రైవర్ లైంగిక దాడికి యత్నించాడు. అతడి నుంచి తప్పించుకొని ఆ మహిళా కండక్టర్ జైపూర్ పోలీస్ లను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు జైపూర్ పోలీసులు శ్రీనివాస్ పై కేసు నమోదు చేశారు.

Temporary  Driver Sexual Assault on Temporary Female Conductor

 

Latest Updates