బస్ పాస్ లు చెల్లవ్ : తాత్కాలిక సిబ్బంది దురుసు ప్రవర్తన

హైదరాబాద్: ప్రైవేట్ వాహనాల దోపిడీకి భయపడి బస్ పాస్ లున్నవారు ఆర్టీసీ బస్సుల్లో ఎక్కినప్పుడు వారికి అక్కడా ఇబ్బందులు తప్పడం లేదు. బస్ పాస్ ఉన్నా.. టికెట్ తీసుకోవాలని, లేకుంటే బస్ దిగాలని ప్యాసింజర్లతో తాత్కాలిక సిబ్బంది దురుసుగా వ్యవహరిస్తున్నారు. సోమవారం పంజాగుట్టలో ప్రయాణికులకు ఇలాంటి సమస్యే ఎదురైంది.

కొంతసేపు కండక్టర్​తో ప్యాసింజర్లు వాగ్వాదం చేశారు. టికెట్ చార్జీ రెట్టింపు వసూలు చేశారు. పైసలు తీసుకుని టికెట్ కూడా ఇవ్వడంలేదని చాలామంది తెలిపారు. ఈ విషయాన్ని కూకట్ పల్లి డిపో మేనేజర్​ నరసింహ దృష్టికి ‘వెలుగు’ తీసుకెళ్లగా ఆర్టీసీ బస్సుల్లో జనరల్ బస్
పాస్ లు చెల్లుతాయని చెప్పారు.

Latest Updates