గ్రేటర్ హైదరాబాద్ లో బస్ షెల్టర్లకు టెండర్లు

  •  పాతవాటి స్థానంలోనే కొత్తవి ఏర్పాటు
  • కన్ స్ట్రక్షన్, మెయింటెనెన్స్ ప్రవేట్ సంస్థలదే

లాక్ డౌన్ టైమ్ ను బల్దియా యూజ్ చేసుకుంటూ అభివృద్ధి పై ఫోకస్ పెట్టింది. పెండింగ్ లో పడిపోయిన పనులను ఆచరణలోకి తెస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ లో 201 బస్ షెల్టర్ల రీకన్ స్ట్రక్షన్ కి జీహెచ్ఎంసీ చర్యలు తీసుకుంటోంది. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యం(పీపీపీ) తో టెండర్లు ఆహ్వానించింది. ఈ నెల 13న ప్రారంభమైన ప్రాసెస్ 30తో ముగియనుంది. జీహెచ్ఎంసీ ట్రాన్స్ పోర్ట్ వింగ్ జారీ చేసిన టెండర్ నోటిఫికేషన్ ప్రకారం 201 బస్ షెల్టర్లను 4 ప్యాకేజీలుగా విభజించారు. 3 ప్యాకేజీల్లో 50 చొప్పున, నాలుగో ప్యాకేజీలో 51 బస్ షెల్టర్ లను నిర్మించనున్నారు.

8వారాల్లో…

టెంటర్ దక్కించుకున్న కంపెనీలకు జీహెచ్ఎంసీ బస్ షెల్టర్ల నిర్మాణ పనులు అప్పగించుంది.ఒప్పందం ప్రకారం పాత షెల్టర్లు కూల్చివేసి, కొత్త షెల్టర్ నిర్మాణం, నిర్వహణ బాధ్యతలు చూడాలి.జీహెచ్ఎంసీ ఇచ్చిన మోడల్ లో 8వారాల్లో నిర్మించాలి. మరుగుదొడ్లుః నిర్ణం, కనీస వసతులు కల్పించాలి. ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయంలో జీహెచ్ఎంసీకి వాటా చెల్లించాలి.ఎక్కువ మొత్తం చెల్లిస్తామని కోట్ చేసిన కంపెనీకి మూడేళ్ల కాలపరిమితితో పనులు అప్పగించనున్నారు. వీలైనంత త్వరగా టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి,పనులు ప్రారంభించాలని అధికారులు భావిస్తున్నారు.

కిందటి సారి టాయిలెట్స్ నిర్మించలే…

సీటీలో మోడ్రస్ బస్ షెల్టర్ల నిర్మాణానికి మూడేండ్ల క్రితం జీహెచ్ఎంసీ ప్లాన్ చేసింది.ఎంపిక చేసిన 826 చోట్ల షెల్టర్ల నిర్మాణ బాధ్యతలను ప్రైవేట్ కంపెనీలకు అప్పగించగా, మూడేళ్లలో కేవలం 470 మాత్రమే పూర్తయ్యాయి. మురుగుదొడ్లు కూడా నిర్మించలేదు. యాడ్స్ ద్వారా ఆదాయం వస్తున్నా ప్రయాణికులకు ఫెసిలిటీస్ కరువయ్యాయి. ఆర్టీసీ, మెట్రో, ట్రాఫిక్ విభాగాల సూచనలను పరిగణన లోకి తీసుకున్న బల్దియా అధికారులు ఇప్పుడు కొత్తగా 201 చోట్ల బస్ షెల్టర్లు నిర్మించాలని నిర్ణయించారు.

Latest Updates