పోతిరెడ్డిపాడు పనులకు టెండర్లు

రూ. 3,278 కోట్ల వర్క్స్ కు ఏపీ సర్కార్ నోటిఫికేషన్

ఆగస్టులో పూర్తి కానున్న మొత్తం ప్రాసెస్

హైదరాబాద్, వెలుగు: శ్రీశైలం నుంచి రోజుకు మూడు టీఎంసీల నీటిని ఎత్తిపోసే పోతిరెడ్డిపా డు

(సంగమేశ్వరం) లిఫ్ట్ స్కీం కు ఏపీ ప్రభుత్వం టెండర్లు ప్రారంభించిం ది. ఏపీ వాటర్ రిసోర్సెస్ డిపార్ట్ మెంట్ కర్నూ ల్ జిల్లా నంద్యా ల ఎస్ఈ ఈ–ప్రొక్యూర్మెంట్ విధానంలో రూ.3 ,278.18 కోట్ల పనులకు టెండర్ నోటిఫికేషన్ జారీ చేశారు. సోమవారం మధ్యాహ్నం నుంచి ప్రాసెస్ మొదలైంది. వర్క్ ఏజెన్సీలు ఆన్ లైన్ లో టెండర్లు అప్లికేషన్లు డౌన్ లోడ్ చేసుకొ ని ఆగస్టు 3 వరకు టెండర్లు దాఖలు చేయవచ్చు. రివర్స్ టెండర్ల లో అందరికన్నా తక్కువకు కోట్ చేసిన వర్క్ ఏజెన్సీకి పనులు అప్పగిస్తారు. ఈ మొత్తం ప్రక్రియను ఆగస్టులో కంప్లీ ట్ చేయాలని ఏపీ వాటర్ రీసోర్సె స్ ఆఫీసర్లు టార్గెట్ గా పెట్టుకున్నారు. పనులు దక్కించుకున్న వర్క్ ఏజెన్సీ 30 నెలల్లోగా పనులు పూర్తి చేయాల్సి ఉంటుంది. జ్యుడీషియల్ ప్రివ్యూకు అబ్జెక్షన్స్ పోతిరెడ్డిపా డు (సంగమేశ్వరం) టెండర్ల ప్రక్రియపై నారాయణపేట జిల్లా కు చెందిన పలువురు ప్రజా ప్రతినిధులు, రైతు సంఘాల బాధ్యులు ఏపీ జ్యుడీషియల్ ప్రివ్యూకు అభ్యం తరాలు చెప్పారు. దామరగిద్ద సర్పంచుల సంఘం, మండలంలోని వివిధ గ్రామ పంచాయతీలు తీర్మానాలు చేసి తమ అభ్యంతరాలను మెయిల్ ద్వారా పంపారు. ఏపీ చేపడుతున్న ప్రాజెక్టులపై కేఆర్ఎంబీ, కేంద్ర జలశక్తి శాఖకు ఫిర్యాదు చేస్తామని, ఆ తర్వాత సుప్రీంకోర్టు ద్వారా న్యా యపోరాటం చేస్తామని ఎన్జీటీలో ఏపీ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా పిటిషన్ దాఖలు చేసిన గవినోళ్ల శ్రీనివాస్ తెలిపారు.

ఇంకా సరైన టైం రాలేదా కేసీఆర్ సారూ?

ఏపీ తలపెట్టిన ప్రాజెక్టులపై సరైన సందర్భంలో స్పందిస్తామని మే 18న కేసీఆర్ మీడియాకు చెప్పారు. ‘‘నీళ్ల గురించి కేసీఆర్ తోనే మాట్లాడుతరా.. లెక్కలు నాకే చెప్తరా.. మతి ఉండా లె.. నీళ్ల పాలసీ మీద నాకు స్పష్టమైన అవగాహన ఉంది. పోతిరెడ్డిపా డుపై ఇప్పుడే మాట్లాడదల్చుకోలె. టైమ్ వచ్చినప్పుడు మాట్లా డుత..’’ అని నాడు మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు సీఎం కేసీఆర్ బదులిచ్చారు. పోతిరెడ్డిపా డు పై ఫిర్యాదుల ప్రక్రియ కంటిన్యూయస్ ప్రాసెస్ అని, అది తనకు చెప్పాల్సిన అసవరమేలేదని, తనకంతా తెల్సు అని చెప్పారు. అయితే.. ఏపీ ప్రభుత్వం టెండర్ల వరకు వెళ్లినా సీఎం కేసీఆర్ కు సరైనా టైం రాలేదా అని పాలమూరు ఉద్యమ వేదికలు ప్రశ్ని స్తున్నాయి. మన రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు దుర్మార్గంగా ఉందని మండిపడుతున్నాయి.

Latest Updates