సర్జరీ లేకుండా టెన్నిస్‌‌‌‌‌‌‌‌ ఎల్బో చికిత్స

సచిన్‌ టెండుల్కర్‌ లాంటి ఆటగాళ్లు టెన్నిస్‌‌‌‌‌‌‌‌ ఎల్బో చికిత్స చేయించుకున్నారని చాలా సార్లువినే ఉంటారు.. మోచేతి నొప్పి వల్ల ఆట నుంచి రిటైర్డ్‌‌‌‌‌‌‌‌హర్ట్‌‌‌‌‌‌‌‌గా వెనుదిరిగిన వారినీ చూసుంటారు..అసలెంటీ టెన్నిస్‌‌‌‌‌‌‌‌ ఎల్బో.. అంటే మోచేతి బయటివైపు విపరీతమైన నొప్పి ఉండటం.. దీని వల్ల వంటవండటం, చిన్నారులను స్కూల్‌ నుంచి తీసు కురావడం, కంప్యూటర్‌ పైన పని లాంటి చిన్న చిన్న పనులూచేయలేరు. ఏళ్లుగా ఫిజికల్‌ థెరపీ చేయించుకున్నా, మందులు వాడినా నొప్పి తగ్గని వారు చివరికి పెద్దపెద్ద సర్జరీలకు సిద్ధమవుంటారు. అయితే ఇలాంటిదీర్ఘకాలిక నొప్పికి సర్జరీ చేయకుండా చికిత్స చేయొచ్చని జపాన్‌ సైంటిస్టులు అంటున్నారు.

ట్రాన్స్‌‌‌‌‌‌‌‌కాథెటర్‌ ఆర్టెరియల్‌ ఎంబోలైజేషన్‌ (టీఏఈ) ద్వారా గాయమైన ప్రాంతానికి తక్కువ రక్తం సరఫరా అయ్యేలా చేసి నొప్పిని, బాధను తగ్గించొచ్చంటున్నారు. టెన్నిస్‌‌‌‌‌‌‌‌ ఎల్బోతో బాధపడుతున్న 52 మంది పేషెంట్లకు 2013 మార్చి నుంచి 2017 అక్టోబర్‌ మధ్య సైంటిస్టులు టీఏఈ చికిత్స చేశారు. తర్వాత రెండేళ్లు వారిని గమనించారు. రెండేళ్ల తర్వాత 32మంది పేషెంట్ల ఎల్బోస్కాన్‌ లు తీయగా కండరాల్లోచాలా వరకు మార్పు కనిపించింది. టీఏఈ చికిత్సను కేవలం గంటలోనే చేస్తారు. ముంజేయి ధమనిని గుర్తించి దాంట్లో సూదంత రంధ్రం చేసి చికిత్సమొదలుపెడతారు. తొలుత కాథెటర్‌ (ట్యూబ్‌ )నుమణికట్టు నుంచి మోచేయిలో నొప్పి ఉన్న రక్త నాళం వరకు పంపుతారు. నొప్పి ఉన్న ప్రాంతానికి ఎక్కు వరక్తం సరఫరా అవకుండా చికిత్స చేస్తారు. మోచేయిదగ్గరున్న కండరాలపై ఒత్తిడి పెరగడం వల్ల టెన్నిస్‌‌‌‌‌‌‌‌ ఎల్బో సమస్య వస్తుంది. టెన్నిస్‌‌‌‌‌‌‌‌, గోల్ఫ్‌ క్రీడాకారులు,కార్పెంటర్లు, వంట చేసే వారికి ఈ సమస్య వస్తుంది.

Latest Updates