చర్లపల్లి జైలు దగ్గర ఉద్రిక్త పరిస్థితి

చర్లపల్లి జైలు దగ్గర ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. డాక్టర్ హత్య కేసులో నిందితులను షాద్ నగర్ పోలీస్ స్టేషన్ నుంచి భారీ పోలీసు బందోబస్తు మధ్య చర్లపల్లి జైలుకు తరలించారు పోలీసులు. అంతకు ముందు నిందితులను తమకు అప్పగించాలంటూ స్థానిక ప్రజలతో పాటు పెద్ద ఎత్తున జనం షాద్ నగర్ పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. అయితే నిందితులను పోలీసు వాహనాల్లో చర్లపల్లికి తరలించారు. దీంతో చర్లపల్లి జైలు దగ్గరకు కూడా చేరుకున్న కొంత మంది యువకులు నిందితులను తమకు అప్పగించాలంటూ ఆందోళనకు దిగారు. లేదంటే వెంటనే ఉరిశిక్ష అమలు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.

ఈ క్రమంలోనే పోలీసులతో యువకులు వాగ్వాదానికి దిగారు. దీంతో పోలీసులు, ఆందోళనకారుల మధ్య ఘర్షణ జరిగింది. వారిని అడ్డుకునేందుకు పెద్ద ఎత్తన పోలీసులు మోహరించారు. కొంతమంది ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. దీంతో జైలు పరిసర ప్రాంత్తాల్లో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఆందోళనకారులను అడ్డుకునేందుకు జైలు దగ్గర పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.

Latest Updates