డబుల్ బెడ్ రూం ఇళ్ల ప్రారంభోత్సవంలో ఉద్రిక్తత

వరంగల్ రూరల్ జిల్లా రాయపర్తి మండలం మైలారంలో డబుల్ బెడ్ రూం ఇళ్ల ప్రారంభోత్సవం ఉద్రిక్తతకు దారితీసింది. మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు, కలెక్టర్ హారిత ఇళ్లను ప్రారంభిస్తుండగా … కొందరు మహిళలు ఆందోళనకు దిగారు. డబ్బులు తీసుకొని సొంత ఇళ్లు ఉన్నోళ్లకే మళ్లీ ఇళ్లు ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 150 మందికి ఇళ్ల కోసం కేటాయించిన భూమిని 5 వేలకు ప్రభుత్వం తీసుకొని  20 మందికే ఇళ్లు ఇచ్చారని ఆరోపించారు మహిళలు.

Latest Updates