ట్యాంక్‌బండ్‌పై ఉద్రిక్తత

హైద్రాబాద్: ఆర్టీసీ జేఏసీ పిలుపునిచ్చిన ‘చలో ట్యాంక్‌బండ్‌’ ఉద్రిక్తతకు దారి తీసింది. ట్యాంక్‌బండ్‌‌కు వచ్చే దారులను పోలీసులు మూసివేసినా.. ఆర్టీసీ కార్మికులు వాటిని దాటుకుంటూ ట్యాంక్‌బండ్‌‌కు చేరుకుంటున్నారు. ట్యాంక్‌బండ్‌పై ఉన్న వెంకటస్వామి విగ్రహం వద్దకు చేరుకున్న కార్మికులు, రోడ్డు పై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆందోళన చేస్తున్న కార్మికులను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులకు, కార్మికులకు మధ్య జరిగిన తోపులాటలో ఓ ఆర్టీసీ కార్మికుడు అస్వస్థతకు గురయ్యాడు. పోలీసులు వెంటనే అతన్ని చికిత్స నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు.

 

Latest Updates