కరోనా టెన్షన్.. పుకార్లతో పరేషాన్

సీఎంనూ వదల్లేదు
డిప్యూటీ మేయర్ కూడా బాధితుడే

పొలిటిషియన్స్ , హాస్పిటల్స్ టార్గెట్ గా ఫేక్ న్యూస్ వైరల్

సైబర్ క్రైమ్ పోలీసులకు పెరుగుతున్న కంప్లయింట్స్

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: అసలే జనం కరోనా టెన్షన్​లో ఉంటే, కొందరు వైరస్​ పాజిటివ్​ ​పేరుతో సోషల్​మీడియా, వెబ్ ​చానెల్స్​లో ఫేక్‌‌‌‌ న్యూస్‌‌‌‌ వైరల్‌‌‌‌ చేస్తున్నారు. వీఐపీలు, ప్రజాప్రతినిధులు, డాక్టర్లపై వదంతులు సృష్టించి పబ్లిక్​ను మిస్​ గైడ్ ​చేస్తున్నారు. జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్‌‌‌‌‌‌‌‌ బాబా ఫసియుద్దీన్‌‌‌‌కి వైరస్​సోకిందని ఇటీవల కొన్ని వెబ్‌‌‌‌ చానెల్స్​లో ప్రచారం జరిగింది. ఒక పేషెంట్​కు ఫసియుద్దీన్‌‌‌‌ ఫేస్​ను మార్ఫింగ్​ చేసి సర్క్యులేట్‌‌‌‌ చేశాయి. ఫసియుద్దీన్ సెక్రటరీ​ కంప్లయింట్​తో మంగళవారం సిటీ సైబర్‌‌‌‌‌‌‌‌ క్రైం పోలీసులు కేసు ఫైల్​చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ప్రైవేట్ ​హాస్పిటల్​ను టార్గెట్ చేస్తూ…

బంజారాహిల్స్​లోని ఓ ప్రైవేట్ ​హాస్పిటల్​ను టార్గెట్​ చేస్తూ కరోనా న్యూస్‌‌‌‌ సర్క్యులేట్‌‌‌‌ అవుతోంది. అక్కడి డాక్టర్లు, నర్సులకు పాజిటివ్‌‌‌‌ వచ్చిందని వాట్సాప్‌‌‌‌లో చక్కర్లు కొడుతోంది. హాస్పిటల్‌‌‌‌ సీఈఓ మంగళవారం సిటీ సైబర్‌‌‌‌‌‌‌‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఏసీపీ కేవీఎం ప్రసాద్‌‌‌‌ ఆధ్వర్యంలో కేసు ఫైల్​చేసి నిందితులు ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

ఒకరికి లుక్‌‌‌‌ ఔట్‌‌‌‌ నోటీస్​

సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌కి కరోనా వచ్చిందని ఫేక్‌‌‌‌ న్యూస్‌‌‌‌ వైరల్ చేసిన వ్యక్తిని సిటీ సైబర్‌‌‌‌‌‌‌‌క్రైం పోలీసులు గుర్తించారు. జగిత్యాలకు చెందిన పణ్యాల రాజు ఫేస్‌‌‌‌బుక్​లో ఈ ఫేక్‌‌‌‌ న్యూస్‌‌‌‌ క్రియేట్‌‌‌‌ చేశాడు. ప్రస్తుతం దుబాయ్​లో ఉన్న అతడిపై లుక్‌‌‌‌ ఔట్‌‌‌‌ నోటీస్​ ఇష్యూ చేశారు. సోమవారం టీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌వీ ప్రతినిధులు ఇచ్చిన కంప్లయిట్​తో సైబర్‌‌‌‌‌‌‌‌ క్రైమ్‌‌‌‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు.

జాబ్​ ముసుగులో..

ఇటీవల నౌకరీ డాట్‌‌‌‌ కామ్‌‌‌‌లో రిజస్టర్‌‌‌‌‌‌‌‌ చేసుకున్న యూసుఫ్‌‌‌‌గూడకు చెందిన యువతిని సైబర్​ క్రిమినల్స్​ ట్రాప్​ చేశారు. రిజిస్ట్రేషన్​ ఫీజు రూ.5వేలు కట్టించుకున్న తర్వాత.. ప్రస్తుతం కరోనా వల్ల జాబ్​ఆఫర్స్ ​లేవని, రీఫండ్​ చేస్తామని చెప్పి డెబిట్​కార్డు సీవీవీ, ఓటీపీలు తెలుసుకున్నారు. అలా 10 ట్రాన్సాక్షన్లతో రూ.1.17లక్షలు కొట్టేశారు.

For More News..

మంత్రి హరీశ్ రావుపై పోలీసులకు ఫిర్యాదు

సలైవా వాడితే 5 రన్స్‌ పెనాల్టీ

ఆన్​లైన్​లో ఆఫర్స్ హంగామా

మరో పది రోజుల్లో టెన్త్ రిజల్ట్స్

Latest Updates