ఎంపీలో పది పరీక్షలు రద్దు

  • ప్రకటించిన సీఎం

భోపాల్‌: టెన్త్‌క్లాస్‌ బోర్డ్‌ ఎగ్జామ్స్‌కి సంబంధించి మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా కారణంగా వాయిదా పడ్డ పది పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇది వరకు నిర్వహించిన పరీక్షల మార్కులనే పరిగణనలోకి తీసుకుంటామని, దాని ప్రకారమే జాబితాను ప్రకటిస్తామని చెప్పింది. వాయిదా పడ్డ పరీక్షలకు సంబంధించి ‘పాస్‌’ రిమార్క్‌తో మార్క్‌ షీట్‌ ఇవ్వనున్నట్లు చెప్పింది. కాగా.. జూన్‌ 8 నుంచి 16 వరకు 12వ తరగతి పరీక్షలు నిర్వహిస్తామని అన్నారు. ఇప్పటికే 5 నుంచి 8 వ తరగతి వరకు పరీక్షలను రద్దు చేసిన ప్రభుత్వం కేవలం ట్యూషన్‌ ఫీజు మాత్రమే వసూలు చేయాలని చెప్పింది. మధ్యప్రదేశ్‌లో మార్చి 3న పరీక్షలు మొదలయ్యాయి. కాగా కరోనా వ్యాప్తి నేపథ్యంలో వాటిని వాయిదా వేశారు.

Latest Updates