తలనొప్పి భరించలేక టెన్త్ స్టూడెంట్ సూసైడ్

కృష్ణా జిల్లా : తలనొప్పి భరించలేక ఓ బాలడు సూసైడ్ చేసుకున్నాడు. ఈ విషాద సంఘటన కృష్ణా జిల్లాలో సోమవారం జరిగింది. జిల్లాలోని తిరువూరికి చెందిన జీవన్ మణికంఠ(14) అనే విద్యార్థి విజన్‌ స్కూల్ హాస్టల్ ఉంటూ పదో తరగతి చదువుతున్నాడు. సోమవారం ఉదయం అతడు స్కూల్ బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.

మణికంఠ మైగ్రేన్ తలనొప్పితో బాధపడుతూ ఉండేవాడని.. దీనికి తోడు టెన్త్ ఎగ్జామ్స్ దగ్గర పడుతుండడంతో తీవ్ర ఒత్తిడికి గురవుతుండేవాడని మణికంఠ ఫ్రెండ్స్ చెప్పారు. తలనొప్పే కదా అని తమ కొడుకు ఆరోగ్యాన్ని పట్టించుకోలేదంటూ కన్నీరుమున్నీరయ్యారు బాలుడి తల్లిదండ్రులు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.

 

Latest Updates