పరీక్షల భయంతో టెన్త్​ స్టూడెంట్​ సూసైడ్

కాగజ్​నగర్, వెలుగు: రిజర్వాయర్​లో దూకి పదో తరగతి స్టూడెంట్​ఆత్మహత్య చేసుకున్నాడు. రూరల్​ఎస్సై రాజ్ కుమార్​ తెలిపిన వివరాల ప్రకారం.. ఆసిఫాబాద్​ జిల్లా కాగజ్​నగర్​పట్టణం శ్రీనగర్​కాలనీలో ఉండే నేరేళ్ల కరుణాకర్​ కొడుకు విఘ్నేష్​(16) స్థానిక జడ్పీ స్కూల్​లో పదో తరగతి చదువుతున్నాడు. ఈ నెల 11న ప్రీ ఫైనల్​ఎగ్జామ్​ రాసిన తర్వాత నుంచి కనిపించడం లేదు. గురువారం కాగజ్​నగర్​టౌన్​ పోలీస్​స్టేషన్​లో మిస్సింగ్​ కేసు కూడా నమోదైంది.

శుక్రవారం ఉదయం పట్టణానికి సమీపంలోని కోసిని రిజర్వాయర్​లో స్టూడెంట్​ మృతదేహం బయటపడింది. ఘటన స్థలానికి చేరుకున్న ఎస్సై రాజ్​ కుమార్ మృతదేహాన్ని బయటకు తీయించి పంచనామా నిర్వహించారు. పరీక్షల భయమే ఆత్మహత్యకు కారణం కావచ్చని, తోటి స్టూడెంట్లతో ఫెయిల్​అవుతానేమోనని చెప్పాడని ఎస్సై తెలిపారు.

మరిన్ని వార్తల కోసం

Latest Updates