
ఉమ్మడి నల్గొండ జిల్లా స్థానిక సంస్థల MLC ఎన్నికల్లో టీఆర్ఎస్ నేత తేరా చిన్నపరెడ్డి గెలిచారు. ఫస్ట్ రౌండ్ లో ఓట్ల లెక్కింపుతోనే ఆయన విజయం సాధించారు. తేరా చిన్నపరెడ్డికి 640 ఓట్లు పడ్డాయి. కోమటిరెడ్డి లక్ష్మికి 414 ఓట్లు వచ్చాయి. 19 ఓట్లు చెల్లనివిగా తేల్చారు. 226 ఓట్ల తేడాతో తేరా చిన్నపరెడ్డి గెలిచినట్టు అధికారులు చెప్పారు.
ఉమ్మడి నల్గొండలో మొత్తం 1086 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఓట్లు ఉన్నాయి. 1073 మంది స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు .. ఈనెల 31న ఓటేశారు.
నల్లగొండ స్థానిక సంస్థల ఎమ్మెల్సీలో అధికార టీఆర్ఎస్ పార్టీ నుంచి తేరా చిన్నపరెడ్డి … కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సతీమణి లక్ష్మీ పోటీలో దిగారు.
నల్గొండ మండలం దుప్పలపల్లిలోని ఎఫ్.సి.ఐ గోడౌన్స్ లో ఉదయం 8గంటలకు కౌంటింగ్ మొదలైంది. ఈ ఎన్నికల్లో తేరా చిన్నపరెడ్డి విజయం సాధించారు.