బ్యాలెట్ బాక్స్ లోని ఓట్లకు చెదలు.. కౌంటింగ్ నిలిపివేత

జయశంకర్ భూపాలపల్లి: రాష్ట్ర వ్యాప్తంగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఈ క్రమంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలంలో కూడా ఉదయం 8 గంటలకే కౌంటింగ్ మొదలైంది.  అయితే మండలానికి చెందిన అంబట్ పల్లి గ్రామంలోని  కౌంటింగ్ నిమిత్తం బ్యాలెట్ బాక్స్ ఓపెన్ చేయగా అందులోని ఓట్లు పూర్తిగా చెదలు పట్టాయి.

ఈ  విషయాన్ని గుర్తించిన MPDO, DPO వెంటనే జిల్లా కలెక్టర్ కు సమాచారం అందించారు. కలెక్టర్ ఆదేశాలు మేరకు ఆ బ్యాలెట్ బాక్స్ ను కౌంటింగ్ చేయకుండా ఆపేశారు.ఆ బాక్స్ లో మొత్తం 395 ఓట్లు ఉన్నవి.

 

Latest Updates