విమానం ఇంజిన్ ఫెయిల్.. గాల్లో మంటలు

‘దేవుడా మమ్మల్ని కాపాడు’ అంటూ కొందరు ప్రయాణికులు వేడుకుంటున్నారు. ఇంకొందరు కుటుంబ సభ్యులకు చివరి మెసేజ్ పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. కళ్ల ముందే తాము ఉన్న విమానం ఇంజిన్ కాలిపోతుంటే, ఏం చేయాలో తెలీక చాలా మంది భయంతో కేకలు వేస్తున్నారు.ఫ్లైట్ అటెండెంట్లు వాళ్లను సముదాయించేందుకు ప్రయత్నిస్తున్నారు. డెల్టా ఎయిర్ లైన్స్ కు చెందిన 1425 నెంబరు గల విమానం సోమవారం 150 మంది ప్రయాణికులతో అట్లాంటా నుంచి బాల్టీమోర్ కు బయల్దేరింది. కొద్ది సేపటికి ఎడమ రెక్క కింద ఇంజిన్ నుంచి పెద్ద శబ్దం వచ్చింది. దాంతో ప్యాసింజర్లు హడలిపోయారు. ఏం జరిగిందో చూసే సరికి గుండెలు జారిపోయాయి. ఇం జిన్ లో చిన్న పార్టు ఊడి అటూ ఇటూ కొట్టుకుంటోంది. దాని దెబ్బకు మంటలు రాజుకుంటున్నాయి. క్యాబిన్ అంతా పొగచూరిపోయింది. దీంతో చాలా మంది భయంతో కేకలు పెట్టడం మొదలుపెట్టారు. ఇదంతా వీడియో తీసిన ఓ వ్యక్తి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఈలోగా అప్రమత్తమైన పైలట్లు విమానాన్ని స్లో చేశారు. ఏటీసీతో మాట్లాడి నార్త్ కరోలినాలోని రేలీ–దుర్హమ్ ఎయిర్ పోర్టులో ల్యాండింగ్ కు అనుమతి తీసుకున్నారు. ఆ తర్వాత సేఫ్ గా కిందికి దించారు. దాంతో ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు. షాక్ కు గురైన కొందరికి ఫస్ట్ ఎయిడ్ అందించారు.

Latest Updates