సీఆర్పీఎఫ్ జవాన్లపై ఉగ్ర దాడి

terror-attack-on-jawans-in-anantnag

శ్రీనగర్‌‌: సెంట్రల్ ఆర్మ్ డ్ రిజర్వ్ ఫోర్సెస్(సీఆర్పీఎఫ్) జవాన్లను టెర్రరిస్టులు బుధవారం దొంగ దెబ్బ తీశారు. జమ్మూకాశ్మీర్ అనంత్ నాగ్ లో రద్దీగా ఉన్న కె.పి.రోడ్ లో సీఆర్పీఎఫ్ కు చెందిన 116 బెటాలియన్ జవాన్లు, రాష్ట్ర పోలీసులు పికెటింగ్ కు వచ్చారు. ముఖానికి మాస్కులు కట్టుకుని అక్కడికి బైకుపై వచ్చిన ఇద్దరు టెర్రరిస్టులు, ఒక్కసారిగా జవాన్లపై బుల్లెట్ల వర్షం కురిపించారు. గ్రెనేడ్లు విసిరారు. ఈ ఘటనలో ఐదుగురు జవాన్లు అమరులయ్యారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.

అనంత్‌నాగ్‌ పోలీస్‌ స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌‌, స్థానిక మహిళకు గాయాలయ్యాయి. గాయపడిన జవాన్లను దగ్గరలోని 92 ఆర్మీ బేస్ ఆసుప్రతికి తరలించారు. పోలీసు ఆఫీసర్, మహిళకు శ్రీనగర్ ఆస్పత్రిలో ట్రీట్ మెంట్ ఇస్తున్నారు. జవాన్ల ఎదురుకాల్పుల్లో ఓ టెర్రరిస్టు హతమయ్యాడు. అతడి నుంచి ఏకే 47ను స్వాధీనం చేసుకున్నారు. పాకిస్థాన్‌ కు చెందిన ‘అల్‌ ఉమర్‌‌ ముజాహిద్దీన్‌’ టెర్రరిస్టు సంస్థ తామే ఈ దాడికి పాల్పడినట్లు ప్రకటించుకుంది.

Latest Updates