70 ఏళ్లలో ఉగ్రవాదం తప్పిస్తే ఏం సాధించారు?

పాకిస్తాన్‌‌పై భారత్ మండిపాటు

న్యూఢిల్లీ: యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ 75వ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సెషన్స్‌‌లో భాగంగా శుక్రవారం పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కాశ్మీర్ వివాదాన్ని ప్రస్తావించారు. దీనిపై ఇండియా మండిపడింది. గత 70 ఏళ్లలో టెర్రరిజం వ్యాప్తి తప్ప పాకిస్తాన్ సాధించింది ఏమీ లేదని యూఎన్‌‌లో ఇండియా ప్రతినిధి మిజితో వినితో ఎద్దేవా చేశారు. కాశ్మీర్ భారత్‌‌ సమగ్రతకు సంబంధించిన విషయమని, తమ దేశంతో ఆ ప్రాంతం విడదీయరానిదని స్పష్టం చేశారు. జమ్మూ కాశ్మీర్ విషయంలో తీసుకున్న నిర్ణయాలు తమ దేశ అంతర్గత వ్యవహారాలకు సంబంధించినవని స్పష్టం చేశారు. తాము సాధించింది ఏమీ లేదు కాబట్టే ఇతరులపై విమర్శలకు దిగుతున్నారని ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యలకు దీటుగా సమాధానం చెప్పారు. అబద్ధాలు, తప్పుడు సమాచారం, దుర్మార్గాన్ని వ్యాప్తి చేయాలనుకుంటున్నారని దుయ్యబట్టారు. భయంకరమైన టెర్రరిస్టులకు పెన్షన్లు ఇస్తున్న పాక్ ముందు తాను ఆక్రమించిన ప్రాంతాలను ఖాళీ చేయాలన్నారు.

Latest Updates