పాకిస్తాన్ హోటల్లో చొరబడిన ఉగ్రవాదులు

పాకిస్తాన్ లోని ఓ ఫైవ్ స్టార్ హోటల్లో ఉగ్రవాదులు చొరబడ్డారు. బలుచిస్తాన్ ప్రావిన్స్ లోని గ్వడార్ లో ‘పెర్ల్ కాంటినెంటల్ హోటల్’ లోకి సాయుధులైన ముగ్గురు ఉగ్రవాదులు చొరబడినట్లు పోలీసులు తెలిపారు. దీంతో భద్రతా బలగాలు ఆ హోటల్ ను తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. శనివారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఉగ్రవాదులు హోటల్ లోకి చొరబడినట్లు తెలిపారు. హోటల్ లో ఉన్న 95శాతం మందిని బయటకు తీసుకొచ్చినట్లు చెప్పారు.  హోటల్ నుంచి తుపాకీ పేలిన చప్పుళ్లు వినిపిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. హోటల్ లో విదేశీయులెవరూ లేరని చెప్పారు.