అవంతిపొరా ఎదురుకాల్పుల్లో ఉగ్రవాది హతం

జమ్ము కశ్మీర్‌ లోని  అవంతిపొరాలో ఎదురుకాల్పులు జరిగాయి. పెట్రోలింగ్‌ నిర్వహిస్తున్న భద్రతా బలగాలకు ఉగ్రవాదులు ఎదుట పడటంతో దుండగులు కాల్పులు ప్రారంభించారు. భద్రతా బలగాలు జరిపిన ఎదురు కాల్పుల్లో ఉగ్రవాది హతం అయ్యాడు. మిగతా ఉగ్రవాదులు తప్పించుకున్నారు. పారిపోయిన ఉగ్రవాదుల కోసం బలగాలు గాలిస్తున్నాయి. ఘటనా స్థలంలో పేలుడు సామాగ్రి, ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు పోట్రోలింగ్ సిబ్బంది.

 

Latest Updates