బారాముల్లాలో ఎదురు కాల్పులు: ఉగ్రవాది హతం

జమ్మూకశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలో ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఇవాళ(బుధవారం) తెల్లవారుజామున భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పుల్లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. ఉద్రవాదులు జరిపిన కాల్పుల్లో స్పెషల్‌ పోలీసు అధికారి చనిపోగా..మరో పోలీసు అధికారికి తీవ్రంగా గాయాలయ్యాయి. గాయపడ్డ పోలీసును చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ఎదురుకాల్పులు జరిగిన ప్రాంతంలో భద్రతా బలగాలు కూంబింగ్‌ కొనసాగిస్తున్నాయి.

Latest Updates