ముంబైలో ఉగ్ర కలకలం.. నో ఫ్లైజోన్‌గా ప్రకటన

దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఉగ్ర కలకలం మొదలయ్యింది. అసాంఘిక శక్తులు దాడులకు పాల్పడవచ్చునన్న నిఘావర్గాల హెచ్చరికతో.. భద్రతా బలగాలు అలర్టయ్యాయి. గట్టి నిఘా ఏర్పాటు చేశాయి.

అంతేకాదు లేటెస్టుగా ముంబై  నగరాన్ని నో ఫ్లైజోన్‌గా ప్రకటించినట్టు ప్రజాసంబంధాల విభాగం డైరెక్టర్‌ జనరల్‌ ట్విట్టర్‌లో తెలిపారు. నిఘా వర్గాల హెచ్చరికతో ముందు జాగ్రత్తలు చేపట్టినట్లు తెలిపారు. ముంబై గగనతలంలో చిన్న విమానాలు, డ్రోన్లు, పారాగ్లైడర్స్‌, బెలూన్లు, క్రాకర్లు, పతంగులు, లేజర్‌ లైట్లు వినియోగించకుండా నిషేధం విధించారు. మార్చి 24వ తేదీ వరకు ఈ నిషేధాజ్ఞలు అమల్లో ఉండనున్నట్లు చెప్పారు. ముంబై ఛత్రపతి శివాజీ మహారాజ్‌ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిషేధం నుంచి మినహాయిచినట్లు తెలిపారు.

Latest Updates