భారత్ కు ఉగ్ర ముప్పు..తమిళనాడుకు 19మంది మిలిటెంట్లు

శ్రీలంకలో వేళ్లూనుకున్న ఉగ్రవాదం ఇపుడు భారత్‌వైపు విజృంభిస్తోంది. పొరుగుననే ఉన్న మిత్రదేశంలో భారీ ఎత్తున ఆత్మాహుతి బాంబర్లు సృష్టించిన విధ్వంసం ప్రపంచం ఇంకా మరువకముందే ఉగ్రవాదులు ఇతరప్రాంతాలకు విస్తరిస్తున్నట్లు నిఘా వర్గాలు పసిగట్టాయి. శ్రీలంకనుంచి సముద్రమార్గంలో తమిళనాడులోని రామనాధపురానికి చేరుకున్నారు. మొత్తం 19మంది ఉగ్రవాదులు సముద్ర మార్గంద్వారా తమిళనాడులోని రామనాధపురం దగ్గర ప్రవేశించినట్లు ఇంటిలిజెన్స్‌ బ్యూరో సమగ్ర నివేదిక ఇచ్చింది. కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరితోపాటు ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, గోవా రాష్ట్రాల్లో 19 చోట్ల దాడులకు వ్యూహరచన చేసినట్లు ఇంటలిజెన్స్ బ్యూరో(IB) హెచ్చరికలు జారీచేసింది. ఈ రాష్ట్రాల కేంద్రపాలిత ప్రాంతాలప్రజలు అప్రమత్తంగా ఉండాలనిసూచించింది. ఉగ్రవాదులు రైళ్లను టార్గెట్‌ చేస్తూ వరుసదాడులకు పాల్పడే అవకాశం ఉన్నట్లుగా హెచ్చరికలు అందాయి. జనసమ్మర్ధం ఉండే ప్రాంతాలు, ప్రార్ధనా మందిరాలు, ఆలయాల దగ్గర కట్టుదిట్టమైన భద్రతాచర్యలు చేపట్టాలని సూచించారు. అన్ని రాష్ట్రాల డీజీపీలకు కూడా హెచ్చరికలు చేసింది.

IB హెచ్చరికలతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర,గోవా, ఉదుచ్చేరిల్లో హై అలర్ట్‌ కొనసాగుతున్నది. ఎయిర్‌పోర్టులు, రైల్వేస్టేషన్లు, షాపింగ్‌మాల్స్‌,రద్దీప్రదేశాల్లో పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. బెదిరింపు ఫోన్‌ కాల్స్‌ను తేలిగ్గా తీసుకోబోమని అప్రమత్తంగా ఉన్నామని సీనియర పోలీస్‌ అధికారులు చెపుతున్నారు. సమస్యాత్మక ప్రాంతాలుప్రార్ధనా మందిరాలు మార్కెట్లు, మాల్స్‌, రైల్వేస్టేషన్లు, విమానాశ్రయాల్లో భద్రతను కట్టుదిట్టంచేసినట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. రెస్టారెంట్లు, మల్టీప్లెక్స్‌, ఫంక్షన్‌ హాల్స్‌, పబ్బులు యాజమాన్యాలు భద్రతను మరింత పటిష్టంచేసుకోవాలని సూచించామని, అవసరమైన ప్రాంతాల్లో CCTV కెమెరాలను మరిన్ని ఏర్పాటుచేసి నిరంతరం పర్యవేక్షణలో ఉంచాలని ఆయా రాష్ట్రాల పోలీస్‌ ఉన్నతాధికారులు యాజమాన్యాలను హెచ్చరించారు.

ప్రస్తుతం రామనాధ పురంలోఉన్న 19మంది ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయారా లేక 19 మంది విడిపోయి వేరువేరు ప్రాంతాలకు వెళ్లారా అన్నదే ప్రస్తుతం పోలీసులు కూపీలాగుతున్నారు. గతంలో శ్రీలంకప్రభుత్వానికి మోస్ట్‌ వాంటెడ్‌ ఉగ్రవాదిగా నిలిచిన హషిమ్‌ జలమార్గంలోనే తమిళనాడుకు చేరుకుని అక్కడినుంచి బంగ్లాదేశ్‌ లో కూడా పర్యటించినట్లు ప్రభుత్వం ఎన్‌ఐఎ అధికారులు గుర్తించారు. ఎన్‌ఐఎ అధికారుల దర్యాప్తు వివరాలను కూడా పరిగణనలోనికి తీసుకుని ప్రస్తుతం దేశవ్యాప్తంగా భద్రతను మరింతగా కట్టుదిట్టంచేసారు.

Latest Updates