శ్రీనగర్‌‌లో ఆరేళ్ల బాలుడ్ని చంపిన టెర్రరిస్టు హతం

  • ఎన్‌కౌంటర్‌‌లో మట్టుబెట్టిన సెక్యూరిటీ

శ్రీనగర్‌‌: జమ్మూకాశ్మీర్‌‌లో టెరరిస్టులు ఏరివేత ముమ్మరంగా సాగుతోంది. గురువారం అర్ధరాత్రి మరో టెర్రరిస్టును మట్టుబెట్టారు. వారం రోజుల క్రితం అనంత్‌నాగ్‌లో ఒక సీఆర్‌‌పీఎఫ్‌ జవాను, ఆరేళ్ల బాలుడ్ని కాల్చిచంపిన టెర్రరిస్టును సెక్యూరిటీ సిబ్బంది మట్టుబెట్టారు. స్పెషల్‌ ఆపరేషన్స్‌ గ్రూప్‌, సీఆర్‌‌పీఎఫ్‌ జాయింట్‌ సెక్యూరిటీ ఆపరేషన్‌ లాంచ్‌ చేసి అతడ్ని పట్టుకున్నట్లు పోలీసులు చెప్పారు. అనంత్‌నాగ్‌లో దాక్కున్న అతడిని కాల్చిచంపినట్లు జమ్మూకాశ్మీర్‌‌ జోన్‌ పోలీసులు ట్వీట్‌ చేశారు. చనిపోయిన వ్యక్తిని జాహిద్‌ దాస్‌గా గుర్తించామన్నారు. పోయిన వారం రోడ్‌ ఓపెనింగ్‌ జరుగుతుండగా టెర్రరిస్టులు కాల్పులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో ఒక సీఆర్‌‌పీఎఫ్‌ జవాను, ఆరేళ్ల అబ్బాయి చనిపోయారు. మరికొంత మంది గాయపడ్డారు.

Latest Updates