పుల్వామాలో ఉగ్రవాదుల కాల్పులు

జమ్ము కశ్మీర్‌లోని పుల్వామాలో ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడ్డారు. ద్రబ్ గాం లోని స్కూల్లో ఎగ్జామ్ జరుగుతుండగా సెక్యూరిటీ గా ఉన్న  crpf జవాన్లపై ఇవాళ(మంగళవారం) ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. భద్రతా దళాలపై దాడికి పాల్పడిన తర్వాత ఉగ్రవాదులు అక్కడి నుంచి పారిపోయారు. దాడులకు తెగబడిన ఉగ్రవాదులను అదుపులోకి తీసుకునేందుకు ఆ ప్రాంతాన్ని సైన్యం గాలిస్తోంది.

జమ్ము కశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌లో భద్రతా దళాలు… ట్రక్‌ డ్రైవర్‌ను చంపిన ఉగ్రవాదిని కాల్చిచంపాయి. ఆ తర్వాత కాసేపటికే పుల్వామా ఉగ్ర దాడి జరిగింది. అనంత్‌నాగ్‌ జిల్లాలోని బిజ్‌బెహరా పట్టణంలో ఉగ్రవాదులు ట్రక్‌ డ్రైవర్‌ను దారుణంగా చంపేశారు. జమ్ము కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్‌ 370ను ఆగస్ట్‌ 5న రద్దు చేసిన తర్వాత కశ్మీర్‌లో కశ్మీరీయేతర వ్యక్తిపై ఉగ్రవాదులు ఈ తరహా దాడి జరపడం ఇది నాలుగోసారి. బాధిత ట్రక్‌ డ్రైవర్‌ను జమ్ముకు చెందిన నారాయణ్‌ దత్‌గా గుర్తించారు అధికారులు.

Latest Updates