జవాన్లపై ఉగ్రవాదుల గ్రెనేడ్ దాడి

శ్రీనగర్‌లో జవాన్లపై ఉగ్రవాదులు బుధవారం గ్రెనేడ్ దాడి చేశారు. ఈ దాడిలో ముగ్గురు శశస్త్ర సీమా బల్ జవాన్లు మరియు ఒక పోలీస్ గాయపడ్డారు. పాత శ్రీనగర్‌లోని నౌహట్టాలో బుధవారం ఎస్ఎస్బీ మరియు పోలీసుల ఉమ్మడి నాకా పార్టీ మీద ఉగ్రవాదులు గ్రెనేడ్ విసిరారు. ఈ దాడిలో ముగ్గురు ఎస్ఎస్బీ జవాన్లు మరియు ఒక పోలీసు కానిస్టేబుల్ స్వల్ప గాయాల పాలైనట్లు ఎస్ఎస్బీ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ తెలిపారు. షోపియన్ జిల్లాలోని జైనాపోరాలో మంగళవారం జరిగిన మరో ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు మృతి చెందినట్లు కాశ్మీర్ జోన్ పోలీసులకు బుధవారం సమాచారం అందింది. భద్రతా దళాలతో జరిగిన ఈ ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు మృతి చెందారు. ఆర్మీకి చెందిన 55 రాష్ట్రీయ రైఫిల్స్, షోపియన్ పోలీసులు, సిఆర్‌పిఎఫ్ జాయింట్ ఆపరేషన్ బుధవారం ప్రారంభించాయి. ఈ ఆపరేషన్ ద్వారా ఇద్దరు ఉగ్రవాదుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు.

For More News..

బాలీవుడ్ నటుడు రిషి కపూర్ కు అనారోగ్యం

Latest Updates