కాశ్మీర్‌‌‌‌‌‌‌‌ వ్యాపారులకు టెర్రరిస్టుల వార్నింగ్‌‌‌‌

  • షాపులు తెరవొద్దంటూ కాశ్మీర్‌‌‌‌‌‌‌‌లో పోస్టర్లు
  • భయంతోనే దుకాణాలు తెరవడం లేదంటున్న ఓనర్లు

శ్రీనగర్‌‌‌‌‌‌‌‌: జమ్మూకాశ్మీర్‌‌‌‌‌‌‌‌లోని వ్యాపారులను టెర్రరిస్టులు బెదిరిస్తున్నారు. షాపులు తెరవొద్దని హుకుం జారీ చేస్తూ పోస్టర్లు అంటించారు. శ్రీనగర్‌‌‌‌‌‌‌‌ మార్కెట్‌‌‌‌ ఏరియా, మసీదుల్లో టెర్రరిస్టు సంస్థల పేరుతో అంటించిన పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. ఆయుధాలతో వచ్చిన కొందరు మిలిటెంట్లు షాపుల్లోకి దూరి ఓనర్లకు వార్నింగ్‌‌‌‌ ఇస్తున్నారని, బ్యాంకుల్లోకి వెళ్లి ఉద్యోగులను భయపెడుతున్నారని పోలీసు అధికారి ఒకరు చెప్పారు. టెర్రరిస్టులకు భయపడి కంప్లైంట్‌‌‌‌ ఇచ్చేందుకు ప్రజలు భయపడుతున్నారని అధికారి అన్నారు. సౌత్‌‌‌‌ కాశ్మీర్‌‌‌‌‌‌‌‌లోని మోద్రిగామ్‌‌‌‌ జిల్లాలో రెండు షాపుల షట్టర్లపై హిజ్‌‌‌‌బుల్‌‌‌‌ ముజాహుద్దీన్‌‌‌‌ టెర్రర్‌‌‌‌‌‌‌‌ గ్రూప్‌‌‌‌  పోస్టర్లు వేసింది. షాపులు తెరవొద్దని తమ సంస్థకు చెందిన సీల్‌‌‌‌ వేశారు.

శ్రీనగర్‌‌‌‌‌‌‌‌లోని సివిల్‌‌‌‌ లైన్స్‌‌‌‌ ఏరియాలో ‘LW’ అని చాలాచోట్ల రాశారని, ‘లాస్ట్‌‌‌‌ వార్నింగ్‌‌‌‌’ అని దాని అర్థమని పోలీసులు చెప్పారు. సెంట్రల్‌‌‌‌ కాశ్మీర్‌‌‌‌‌‌‌‌, శ్రీనగర్‌‌‌‌‌‌‌‌లోని కొన్ని ఏరియాల్లో పోలీస్‌‌‌‌ ఫ్యామిలీలను బహిష్కరించాలని చెప్తూ అల్‌‌‌‌ బాదర్‌‌‌‌‌‌‌‌ టెర్రరిస్ట్‌‌‌‌ గ్రూప్‌‌‌‌ పోస్టర్లు అంటించింది. రాత్రిపూట సెక్యూరిటీ తక్కువగా ఉన్న టైంలో టెర్రరిస్టులు ఈ పోస్టర్లను అంటిస్తున్నట్లు భావిస్తున్నామని పోలీసులు చెప్పారు. కాశ్మీర్‌‌‌‌‌‌‌‌లో 370 ఆర్టికల్‌‌‌‌ను రద్దు చేసినప్పటి నుంచి టెర్రరిస్టులు ఇటువంటి పోస్టర్లను అంటించడం కామన్‌‌‌‌ అయిందన్నారు. టెర్రరిస్టుల వార్నింగ్‌‌‌‌తో ప్రజలు బయటకు వచ్చేందుకు భయపడుతున్నారని అధికారులు చెప్పారు.

షాపులు తెరవాలని ఉన్నా.. భయంగా ఉంది

“మాకు షాపులు తెరవాలని ఉంది. కానీ సెక్యూరిటీ పరంగా పోలీసులు మాకు హామీ ఇవ్వలేదు. సీనియర్‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్స్‌‌‌‌తో మాట్లాడినా ఫలితం లేదు. సెక్యూరిటీ విషయంలో పోలీసులు ఇలా ఎందుకు ఉన్నారో మాకు అర్థం కావడం లేదు” అని ఒక వ్యాపారి చెప్పారు. షాపులు తెరుచుకోకపోవటంతో జమ్మూకాశ్మీర్‌‌‌‌‌‌‌‌లోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Latest Updates