కరోనా సింప్టమ్స్‌ ఉన్నా రెండు సార్లు నెగటివ్‌.. చనిపోయిన 26 ఏళ్ల డాక్టర్‌‌

  • ఢిల్లీలో ఘటన

న్యూఢిల్లీ: కరోనా లక్షణాలతో బాధపడుతున్న ఢిల్లీకి చెందిన రెసిడెంట్‌ జూనియర్‌‌ డాక్టర్‌‌ అభిషేక్‌ భయాన్‌ గురువారం ఉదయం ఢిల్లీలో చనిపోయాడు. అయితే అతనికి టెస్టులు చేయిస్తే రిజల్ట్‌ రెండుసార్లు నెగటివ్‌ వచ్చింది. కానీ విపరీతమైన లక్షణాలతో అతను హార్ట్‌ఎటాక్‌ వచ్చి, శ్వాస అందక చనిపోయినట్లు అభిషేక్‌ సోదరుడు అమన్‌ చెప్పారు. “ నాకు శ్వాస అందటం లేదు. నాకు 100 శాతం కరోనా లక్షణాలు ఉన్నాయి. నేను త్వరలోనే చనిపోతాను” అని అభిషేక్‌ చెప్పారని అమన్‌ అన్నారు. అభిషేక్‌ మౌలానా ఆజాద్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డెంటల్‌ సైన్సెస్‌లోని ఓరల్‌ సర్జరీ డిపార్ట్‌మెంట్‌లో పోస్ట్‌ చేశారని, ఎయిమ్స్‌ ఎమ్‌డీఎస్‌ ఎగ్జామ్‌లో 21 ర్యాంక్‌ వచ్చిందని, పోయిన వారం కౌన్సిలింగ్‌ కోసం హర్యానాలోని రోహతక్‌కి వెళ్లివచ్చినట్లు ఫ్యామిలీ మెంబర్స్‌ చెప్పారు. వెళ్లి వచ్చిన తర్వాత నుంచి రోజు జ్వరం వచ్చి, గొంతునొప్పి అంటున్నాడని అన్నాడు. చెస్ట్‌ స్పెషలిస్ట్‌ దగ్గరికి తీసుకెళ్లగా చెస్ట్‌ ఇన్ఫెక్షన్‌ అని చెప్పారని, కానీ అభిషేక్‌ మాత్రం తనకు కరోనా లక్షణాలు ఉన్నాయని గట్టిగా చెప్పేవాడని కుటుంబసభ్యులు చెప్పారు. “ గురువారం పొద్దున నీరసంగా ఉందని అన్నాడు. దాని కంటే ముందు చాలా ఆరోగ్యంగా ఉన్నాడు. చనిపోయాడు అంటే ఇప్పటికి నమ్మాలని లేదు. ఇంకా షాక్‌లోనే ఉన్నాం. 10 రోజుల క్రితమే లక్షణాలు ఉన్నాయి. కానీ రెండుసార్లు నెగటివ్‌ వచ్చింది. కానీ అతను కరోనా లక్షణాలతో చనిపోయాడని, వైద్యులు ఆక్సిజన్‌ పెట్టినప్పటికీ అభిషేక్‌ చనిపోయాడని అమన్‌ అన్నారు.

Latest Updates