ఏపీలో17,695 మందికి టెస్టులు.. 130 కొత్త కేసులు

అమరావతి: ఏపీలో కరోనా కేసులు ఏ మాత్రం తగ్గడంలేదు. గడిచిన 24 గంటల్లో 17,695 మంది శాంపిల్స్ టెస్ట్ చేయగా 130 మందికి పాజిటివ్ కన్ఫామ్ అయినట్లు అక్కడి హెల్త్ డిపార్ట్ మెంట్ ఆదివారం ప్రకటించింది. వైరస్ బారినపడి ట్రీట్​మెంట్ పొందుతూ కృష్ణా జిల్లాలో ఒకరు, కర్నూలు జిల్లాలో ఒకరు చనిపోవడంతో మొత్తం మృతుల సంఖ్య 75 కు పెరిగిందని ప్రకటించింది. ఆదివారం వివిధ ఆస్పత్రుల నుంచి 30 మంది డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు రాష్ట్రంలో 3,718 మంది వైరస్ బారిన పడగా.. 2,353 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. 1,290 మంది ట్రీట్ మెంట్ పొందుతున్నారు.

Latest Updates