బస్తీ దవాఖానల్లో ఇక నుంచి టెస్టులు కూడా చేస్తారు

ప్రయోగాత్మకంగా 8 బస్తీ దవాఖానల్లో ల్యాబ్‌లు ప్రారంభించిన ఆరోగ్య మంత్రి  ఈటల రాజేందర్

హైదరాబాద్: జంటనగరాల్లోని  బస్తీ దవాఖానల్లో ల్యాబ్ ఫెసిలిటీ కూడా ప్రారంభమైంది. ప్రయోగాత్మకంగా 8 బస్తీ దవాఖానల్లో ల్యాబ్ యంత్రాలు ఏర్పాటు చేశారు. రోగులకు అవసరమైతే ఎక్స్ రే, ఈసీజీ వంటి టెస్టులు కూడా చేస్తారు.. వాటి రిపోర్టులను ఆన్లైన్ లో పంపిస్తారు.  ఏదైనా టెస్ట్ లు అవసరం ఉంటే వెంటనే టెస్ట్ లు చేసేందుకు ఈ డయాగ్నొస్టిక్ కేంద్రాల ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖా మంత్రి ఈటెల రాజేందర్ వెల్లడించారు. శుక్రవారం లాలాపేట దవాఖానలో ల్యాబ్ ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి ఈటెల మాట్లాడుతూ..  పేదలు వైద్య పరీక్షల కోసం వేల రూపాయలు ఖర్చు చేసుకుంటున్నారని,  ఆ సమస్యను లేకుండా చేసేందుకే ఈ డయాగ్నొస్టిక్ సెంటర్స్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. భవిష్యత్తులో మరో 8 కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు.  పేదలకు వైద్యం విషయంలో  పేదలకు ఖరీదైన శాస్త్ర చికిత్సలు ఉచితంగా అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. 8 అధునాతన ఆపరేషన్ థియేటర్ లతో గాంధీ ఆస్పత్రిలో అవయవ మార్పిడి సౌకర్యం అందుబాటులో ఉందని, అలాగే  ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఆధునిక సౌకర్యాలు అందించేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు.  హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ల్యాబులు విజయవంతం అయితే… జిల్లాల్లోనూ అవసరం అయిన చోట ల్యాబులు ఏర్పాటు చేస్తామని మంత్రి ఈటెల వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

హఫీజ్​పేట భూ కబ్జాలపై మళ్లీ పోరాటం తప్పదు

చీటింగ్ పెట్రోల్ బంకులపై కేసుల్లేవ్.. ఓన్లీ జరిమానాలే!

ఆ టెక్నాలజీని డెవలప్ చేస్తే 100 మిలియన్‌‌ల ప్రైజ్ మనీ

Latest Updates