బిట్‌‌‌‌కాయిన్​తో టెథర్ పోటీ

  • క్రిప్టో ఎకోసిస్టమ్‌‌‌‌లో టెథర్‌‌‌‌‌‌‌‌కు ఫుల్ పాపులారిటీ
  • వరల్డ్ మోస్ట్ యూజ్డ్ క్రిప్టోకరెన్సీగా గుర్తింపు
  • బిట్‌‌‌‌కాయిన్‌‌‌‌ను దాటేసిన టెథర్

వెలుగు, బిజినెస్​డెస్క్:​ ప్రపంచంలో అత్యంత ఎక్కువగా వాడే క్రిప్టోకరెన్సీ ఏంటి అంటే..? మీరు బిట్‌‌‌‌కాయిన్ అని చెప్పారనుకోండి.. తప్పులో కాలేసినట్టే. కాయిన్‌‌‌‌మార్కెట్‌‌‌‌క్యాప్.కామ్‌‌‌‌ డేటా ప్రకారం కాయిన్‌‌‌‌ మార్కెట్‌‌‌‌లో ప్రతి రోజూ లేదా నెలవారీ చూసుకున్నా ఎక్కువగా ట్రేడ్‌‌‌‌ అవుతున్న క్రిప్టోకరెన్సీ టెథర్ అని వెల్లడైంది. దీని మార్కెట్ క్యాపిటలైజేషన్‌‌‌‌ ఇతర చిన్న క్రిప్టోకరెన్సీలతో పోలిస్తే 30 రెట్లు ఎక్కువగా ఉంది. టెథర్‌‌‌‌‌‌‌‌ మొట్టమొదటిసారి ఈ ఏడాది ఏప్రిల్‌‌‌‌లో బిట్‌‌‌‌కాయిన్‌‌‌‌ను కూడా దాటేసింది. ఆగస్ట్ ప్రారంభం నుంచి దీని వాల్యు కంటిన్యూగా పెరుగుతోందని, రోజుకు 21 బిలియన్ డాలర్లు పెరుగుతోందని కాయిన్‌‌‌‌మార్కెట్‌‌‌‌క్యాప్‌‌‌‌.కామ్ డేటాలో వెల్లడైంది. టెథర్‌‌‌‌‌‌‌‌ నెలవారీ ట్రేడింగ్ వాల్యుమ్ బిట్‌‌‌‌కాయిన్‌‌‌‌ కంటే కూడా చాలా ఎక్కువగా ఉంది. క్రిప్టో ఎకోసిస్టమ్‌‌‌‌లో ఇది ఇప్పుడు చాలా పాపులారిటీ సంపాదించుకుంది.

ఒకవేళ టెథర్ లేకపోతే.. మనం రోజూ భారీ ఎత్తున లాస్ అవుతామని, సుమారు 100 కోట్ల డాలర్ల వరకు నష్టపోతామని కాన్‌‌‌‌సెన్‌‌‌‌సిస్ గ్లోబల్ ఫైనాన్సియల్ టెక్నాలజీ కోహెడ్ లెక్స్ సోకోలిన్ చెప్పారు. టెథర్‌‌‌‌‌‌‌‌ ఎటువంటి ఒడిదుడుకులకు లోనుకాకుండా.. స్థిరంగా ట్రేడవుతోన్న కాయిన్. ఈ టోకెన్ ధరల ఒడిదుడుకులకు అంతగా ప్రభావం కావడం లేదు. క్రిప్టోకరెన్సీలను బ్యాన్‌‌‌‌ చేసిన చైనా లాంటి దేశాల్లో టెథర్‌‌‌‌‌‌‌‌ను కౌంటర్ల నుంచి కొంటూ క్యాష్‌‌‌‌ను కూడా చెల్లిస్తున్నారంటే ఆశ్చర్యపోవక్కర్లేదు. టెథర్ కాయిన్‌‌‌‌ను జారీ చేయడానికి, రిడీమ్ చేసుకోవడానికి నో–యువర్–కస్టమర్‌‌‌‌‌‌‌‌ ఫామ్‌‌‌‌, ఆమోదపత్రం ఉండాలి. మొత్తం క్రిప్టో ట్రేడింగ్ వాల్యుమ్‌‌‌‌లో ఆసియన్ ట్రేడర్లు 70 శాతం వరకు ఉంటారు. ప్రపంచంలో టాప్ ఎక్స్చేంజీల్లో జరిగే లావాదేవీలన్నింటిలో టెథర్‌‌‌‌‌‌‌‌ను వాడే వారు 40 శాతం నుంచి 80 శాతం వరకు ఉన్నారని కాయిన్ మెట్రిక్స్ చెప్పింది.

తెలియకుండానే వాడేస్తున్నారు..

అయితే తాము టెథర్ వాడుతున్నట్టు చాలా మందికి తెలియనే తెలియదని మాసాచుసెట్స్ ఇన్‌‌‌‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రీసెర్చ్ సైంటిస్ట్ థడూస్ డ్రైజా చెప్పారు. టెథర్‌‌‌‌‌‌‌‌ను ప్రజలు నమ్ముతున్నట్టు తాను భావించడం లేదన్నారు. వారు వాడుతున్నట్టు తెలియకుండానే టెథర్‌‌‌‌‌‌‌‌ను వాడుతున్నారని, ఎక్కడో ఒక దగ్గర బ్యాంక్‌‌‌‌ అకౌంట్‌‌‌‌లో తమ అసలైన డాలర్లు ఉండి ఉంటాయని అనుకుంటున్నారని చెప్పారు. కొన్ని ఎక్స్చేంజీలు కస్టమర్లను తప్పుదోవ పట్టిస్తున్నాయని, టెథర్స్‌‌‌‌ను కాకుండా మీరు డాలర్లనే కలిగి ఉన్నారని మభ్యపెట్టిస్తున్నాయని  డ్రైజా తెలిపారు. అయితే టెథర్‌‌‌‌‌‌‌‌పై కూడా పలు ఆరోపణలున్నాయి.దీనిపై  న్యూయార్క్‌‌‌‌లో విచారణలు కూడా సాగుతున్నాయి. టెథర్ సప్లయి పెరగడం, తగ్గడంపై కూడా స్పష్టమైన వివరాలనేవి లేవు. టెథర్‌‌‌‌‌‌‌‌ను ఆడిట్ కూడా చేయడం లేదు. ఎంత సప్లయిను ఎన్ని రిజర్వ్‌‌‌‌లు కవర్ చేస్తున్నాయన్నది ప్రశ్నార్థకమే.

మార్కెట్ మానిపులేషన్ ఆరోపణలు…

మార్కెట్ మానిపులేషన్‌‌‌‌లో టెథర్ పాత్రపై కూడా యూఎస్ జస్టిస్ డిపార్ట్‌‌‌‌మెంట్ విచారణ చేస్తోంది. 2017లో టెథర్‌‌‌‌‌‌‌‌ను వాడుతూ సగం బిట్‌‌‌‌కాయిన్స్ మార్కెట్‌‌‌‌ మానిపులేషన్‌‌‌‌కు పాల్పడాయనే ఆరోపణలున్నాయి. గత ఏడాది కాలంగా డజన్ స్టేబుల్‌‌‌‌కాయిన్స్ మార్కెట్లోకి వచ్చాయి. వాటిలో చాలా వరకు ఇండిపెండెంట్‌‌‌‌గా ఆడిట్ చేయడం, రెగ్యులేట్ చేయడం జరుగుతోంది. కానీ టెథర్‌‌‌‌‌‌‌‌ను మాత్రం ఇండిపెండెంట్‌‌‌‌గా ఆడిట్ చేయట్లేదు. 2014 నుంచి టెథర్‌‌‌‌‌‌‌‌ ఉందని, అప్పటి నుంచి దాని వాల్యును అది స్థిరంగా కొనసాగిస్తోందని ఒక ఇన్వెస్టర్ చెప్పారు. టెథర్ స్థిరంగా కొనసాగేందుకు చాలా ఎక్స్చేంజీలు సపోర్ట్ చేస్తున్నాయని కొందరు పేర్కొంటున్నారు.