అమరావతిలో చేసిన అభివృద్ధి చాలు: టీజీ

అమరావతి రాజధానిపై టీజీ వెంకటేష్ హాట్ కామెంట్స్ చేశారు. అమరావతిలో చేసిన అభివృద్ధి పనులు ఇక చాలన్నారు. అమరావతిని మరో తాజ్ మహాల్ లా చేస్తాం.. వేల కోట్లు ఖర్చు చేస్తామంటే తాము ఒప్పుకోబోమని అన్నారు. అభివృద్ధి అన్ని ప్రాంతాల్లో జరగాలన్నారు. మిగిలిన ప్రాంతాల్లో అభివృద్ధి చేసిన తర్వాతే అమరావతిలో చేయాలన్నారు. అమరావతిలో ఉండాల్సినవన్నీ కట్టేశారు కాబట్టి కొత్త కట్టడాలు వద్దన్నారు. జగన్ వంద రోజుల పాలనపై స్పందించిన టీజీ.. వంద రోజుల పాలనలో కేంద్రం నుండి వస్తున్న నిధులను వెంటనే ఉపయోగించుకోవడం లేదన్నారు. పోలవరం  కోసం కేంద్రం ఇస్తున్న నిధులను వెంటనే తీసుకోవాలన్నారు. అవినీతిపై విచారణకు తమకేం అభ్యంతరం లేదన్నారు. విచారణ పేరుతో పెండింగ్ పెట్టి కాలయాపన చేయడం సరికాదన్నారు టీజీ.

Latest Updates