వారసత్వ సంపదగా థాయ్​ మసాజ్..

  • త్వరలో హెరిటేజ్​ లిస్ట్​లో చేర్చనున్న యునెస్కో
  • ఇండియా నుంచే థాయ్​లాండ్​కు ఈ కళ

బ్యాంకాక్: బ్యాంకాక్​ అనగానే మనకు గుర్తొచ్చేది థాయ్​ మసాజ్. ఇది అక్కడి సంప్రదాయ టెక్నిక్. త్వరలోనే థాయ్​ మసాజ్​కు అరుదైన గుర్తింపు లభించనుంది. ప్రపంచ వారసత్వ సంపదగా దానిని గౌరవించాలని యునెస్కో నిర్ణయించింది. ఇందుకు సంబంధించి కొద్దిరోజుల్లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కొలంబో రాజధాని బొగోటాలో యునెస్కో ఈ నెల 9 నుంచి 14 వరకూ సమావేశం అవుతోంది. ఈ సందర్భంగానే థాయ్​ మసాజ్​కు హెరిటేజ్​ గుర్తింపుపై నిర్ణయం తీసుకోనున్నారు.

ఎక్కడ చూసినా స్పాలే

థాయ్​ మసాజ్​ను స్థానికంగా ‘నుఆడ్​ తాయి’అని పిలుస్తారు. శరీరంలోని ఆక్యుపంక్చర్​ పాయింట్లను టార్గెట్​ చేసుకుని ఇది సాగుతుంది. చేతి వేళ్లు, మోచేతులు, మోకాళ్లు, పాదాలను ఉపయోగించి శరీరాన్ని రిలాక్స్​ మోడ్​లోకి తీసుకొస్తారు. ఈ మసాజ్ కండరాల నొప్పులు, వెన్ను నొప్పి, తలనొప్పి, నిద్రలేమి, ఆందోళన మొదలైన వాటిని దూరం చేస్తుంది. బ్యాంకాక్​లో ఏ వీధిలో చూసిన స్పాలు, మసాజ్​ సెంటర్లే కనిపిస్తాయి. ఒక గంట పాటు మసాజ్​ చేస్తే అయ్యే ఖర్చు రూ.350 నుంచి మొదలవుతుంది.

ట్రైనింగ్​ ఎట్​ వాట్​పో స్కూల్

సుమారు 2 వేల ఏండ్ల నాటి ఈ స్కిల్​కు సంరక్షకునిగా ఉండటం ఎంతో గర్వంగా ఉందని బ్యాంకాక్​లోని ప్రఖ్యాత బుద్ధ టెంపుల్​ లోని వాట్​పో స్కూల్​మసాజ్​ ట్రెయినర్​ క్రయిరత్​ ఛాంత్రాశ్రీ చెప్పాడు. థాయ్ యువకులతోపాటు ఫారినర్లు వేలాది మందికి అతడు మసాజ్​లో ట్రయినింగ్​ ఇస్తున్నాడు. పూర్వకాలంనాటి ఈ కళను ఇప్పటి వారికి చెప్పడం గొప్ప అవకాశమన్నాడు. ఈ స్కూల్​లో సర్టిఫికెట్​ తీసుకుంటే ఏ మసాజ్​ షాప్ అయినా కళ్లు మూసుకుని ఉద్యోగం ఇస్తుంది. అంత గొప్ప చరిత్ర ఆ స్కూల్​ సొంతం.

ఇండియాలోనే పుట్టింది..

శరీరాన్ని రిలాక్స్​ చేసేలా ఈ కళ ఇండియాలోనే పుట్టింది. అక్కడి నుంచి సుమారు 2,500 ఏండ్ల క్రితం థాయ్​లాండ్​ కు చేరింది. టెంపుల్స్​లో అప్పట్లో గురువులు ఈ కళను శిష్యులకు నేర్పేవారు. ఆ తర్వాత కుటుంబంలో వారికి నేర్పేవారు. 19వ శతాబ్ధంలో థాయ్​లాండ్​ కింగ్​ రామా 3 ఆ కళ గొప్పతనానికి సంబంధించి మెళకువలను వాట్​పో టెంపుల్​లోని రాళ్లపై అప్పటి గురువులు చెక్కారు. అయితే 1962లో అక్కడ స్కూల్​ ఏర్పాటు తర్వాతే ఎక్కువగా ఈ కళను ప్రాక్టీస్​ చేయడం మొదలైంది. ఇప్పటి వరకూ 2 లక్షల మంది ఇక్కడ ట్రయినింగ్​ తీసుకుని 145 దేశాల్లో ప్రాక్టీస్ చేస్తున్నారు.

Thai massage may get spot on UNESCO's prestigious heritage list

Latest Updates