పార్లమెంట్ లో పోర్న్ వీడియోల కలకలం : ఎంపీ వివరణపై ఓ సినిమా తీసేయోచ్చు

థాయ్ లాండ్ పార్లమెంట్ లో పోర్న్ వీడియోలో కలకలం సృష్టించాయి. పార్లమెంట్ బడ్జెట్ ప్రసంగం జరుగుతుండగా.. ఓ ఎంపీ తన ఫోన్ లో పోర్న్ వీడియోల్ని వీక్షించాడు.

డైలీమెయిల్ కథనం ప్రకారం.. థాయ్ లాండ్ చోన్ బురి ప్రావిన్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న అధికార పార్టీ పల్నాగ్ ప్రచారత్ పార్టీ ఎంపీ రోన్నాథెప్ అనువత్ పార్లమెంట్ జరిగే సమయంలో 10నిమిషాల పాటు పోర్న్ వీడియోలు చూశాడు. ఈ సందర్భంగా పార్లమెంట్ బడ్జెట్ ప్రసంగాన్ని కవర్ చేస్తున్న వీడియో జర్నలిస్ట్ లు సదరు ఎంపీ పార్లమెంట్ లో చేస్తున్న నిర్వాహకాన్ని క్యాప్చర్ చేశారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

వీడియోలపై ఎంపీ మాట్లాడుతూ తనని కాపాడాలంటూ ఓ యువతి తనకు ఫోన్ కు మెసేజ్ చేసిందని డైలీ మెయిల్ తన కథనంలో పేర్కొంది. అంతేకాదు బాధితురాలు పంపిన ఫోటోల్ని గమనించారని, ఆ ఫోటోలో బాధితురాలు గ్యాంగ్ స్టర్ చేతిలో చిక్కుకున్నట్లు ప్రస్తావించింది.

డైలీ మెయిల్ కథనం ఎలా ఉన్నా..పార్లమెంట్ లో పోర్న్ వీడియోలు చూడడంపై తమకు వివరణ ఇవ్వాలంటూ ఎంపీ రోన్నాథెప్ అనువత్ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది.

Latest Updates