వైరల్ వీడియో : సైనికుడి ఫైరింగ్.. 21 మంది మృతి

థాయిలాండ్‌లో ఒక సోల్జర్ దారుణానికి ఒడిగట్టాడు. ఒక మాల్‌లోకి చొరబడి విచక్షణా రహితంగా కాల్పులు జరపడంతో 21 మంది మరణించారు. జక్రపంత్ తోమా అనే 32 ఏళ్ల థాయ్ సైనికుడు మొదట తన ఇంట్లో కాల్పులు జరిపాడు. ఆ తర్వాత తాను పనిచేసే ఆర్మీ క్యాంప్‌కు వెళ్లి.. అక్కడి నుంచి మరిన్ని ఆయుధాలతో ఈశాన్య థాయ్‌లాండ్‌లోని నఖోన్ రట్చసీమలోని టెర్మినల్ 21 మాల్‌కు వెళ్లాడు. అక్కడ జక్రపంత్ కనిపించిన వారందరిపైకి కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో 21 మంది చనిపోగా, మరో 33 మంది గాయపడ్డారు. ఈ ఘటన శనివారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమైంది. సాయుధుడైన జక్రపంత్‌ని సైనిక దళాలు కొన్ని గంటలపాటు శ్రమించి ఆదివారం తెల్లవారుజామున మట్టుబెట్టాయి. ఈ ఎదురుదాడులో ఒక సైనికుడు కూడా మరణించినట్లు థాయ్ ప్రజారోగ్య మంత్రి అనుతిన్ చార్న్‌విరాకుల్ తెలిపారు. ఈ ఆపరేషన్ జరుగుతున్న సమయంలో పోలీసులు మాల్ చుట్టూ ఉన్నరోడ్లన్నీ మూసివేసి తమ ఆధీనంలోకి తీసుకున్నారు.

బ్యాంకాక్ నుండి 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న నఖోన్ రట్చసీమాకు సమీపంలో ఉన్న ఆర్మీ బేస్ వద్ద ఈ ఘటన జరిగినట్లు థాయ్ మీడియా తెలిపింది. దాడికి ముందు, జకప్రంత్ తన ఫేస్‌బుక్ ఖాతాలో తాను ప్రతీకారం తీర్చుకున్నానని పోస్ట్ చేసాడు, కానీ, అతను ఎందుకోసం అలా చేశాడో మాత్రం పేర్కొనలేదు.

బౌద్ధ మాఖా బుచా సెలవుదినం సందర్భంగా షాపింగ్ మాల్ వినియోగదారులతో సందడిగా ఉంది. అందువల్లే మృతుల సంఖ్య పెరిగినట్లు అధికారులు తెలిపారు. జక్రపంత్ పోస్ట్ చేసిన వీడియోలో అతను ముసుగు ధరించి.. భుజంపై తుపాకీ పెట్టుకొని ఉన్నాడు. స్పందించిన ఫేస్‌బుక్ వెంటనే అతని ఖాతాను తొలగించింది. ఇటువంటి దారుణాలకు పాల్పడే వారికి ఫేస్‌బుక్‌లో చోటు లేదని ఫేస్‌బుక్ ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు.

Jakrapanth Thomma: Korat, Thailand Mass Shooting Videos

Jakrapanth Thomma is the suspect named in a Korat, Thailand mass shooting that left a trail of people dead. Disturbing videos circulated on Facebook as it emerged the suspect is accused of live streaming portions of the massacre. You can watch some videos from the scene throughout this article but be aware that they are disturbing.The shooting erupted on a military base initially, and then spread out through the city at different locations, culminating in the suspect holing up in a shopping mall. As many as 20 people may have been killed, although final numbers are not definitively clear, BBC reported. The alleged shooter, a sergeant major, was still at large, according to Al-Jazeera. Bangkok Post reported that at least 14 other people were wounded.More Info and video's @ https://heavy.com/news/2020/02/jakrapanth-thomma-video-thailand-mass-shooting/?utm_source=OneSignal

Posted by Extreme Murder and Headlines on Saturday, February 8, 2020

 

 

Latest Updates