కోతులపై కరోనా వ్యాక్సిన్ ప్రయోగం

ప్రారంభించిన థాయ్ లాండ్
బ్యాంకాక్: కరోనా వ్యాక్సిన్ ను డెవలప్ చేయడంలో వరల్డ్ వైడ్ గా చాలా దేశాలు బిజీగా ఉన్నాయి. ఈ ప్రాసెస్ లో కొన్ని దేశాలు మంచి పురోగతిని సాధించాయి. ఈ నేపథ్యంలో శనివారం థాయ్ లాండ్ కరోనా వ్యాక్సిన్ ను కోతులపై ప్రయోగించడం మొదలు పెట్టింది. తొలుత ఎలుకలపై నిర్వహించిన ట్రయల్స్ సక్సెస్ అవడంతో కోతులపై టెస్టింగ్ ను ప్రారంభించింది. ‘ఇది మనుషుల మనుగడకు సంబంధించింది. కేవలం థాయ్ పౌరులకే పరిమితమైంది కాదు. తప్పనిసరిగా వ్యాక్సిన్ ను రూపొందించి.. వరల్డ్ కమ్యూనిటీ వర్క్ ఫోర్స్ లో భాగం కావాలని మా ప్రధాని ప్రయూత్ చాన్ ఓచా నిర్దేశించారు’ అని థాయ్ లాండ్ హయ్యర్ ఎడ్యుకేషన్, సైన్స్ అండ్ రీసెర్చ్ ఇన్నోవేషన్ మినిస్టర్ సువిత్ మాసిన్సీ తెలిపారు.

ప్రపంచవ్యాప్తంగా పనికొచ్చేలా వ్యాక్సిన్ ను డెవలప్ చేస్తున్నామని, వచ్చే ఏడాది నాటికి దీన్ని ఉత్పత్తి చేయాలని ఆశిస్తున్నట్లు సువిత్ పేర్కొన్నారు. కరోనా వ్యాక్సిన్ డెవలప్ చేయడానికి ఇద్దరు మ్యానుఫాక్చురర్స్ ను రిజర్వ్ చేశామన్నారు. వ్యాక్సిన్ తయారీలో థాయ్ ఆర్ఎన్ఏ ను వాడుతోంది. ఇది బాడీ సెల్స్ ను ఆంటీజెన్స్ ప్రొడ్యూస్ చేసేలా ప్రేరేపిస్తుంది. అలాగే వైరస్ ను ఎదుర్కోవడానికి ఇమ్యూన్ సిస్ట మ్ ను సిద్ధం చేస్తుంది. వ్యాక్సిన్ తయారీలో థాయ్ నేషనల్ వ్యాక్సిన్ ఇన్ స్టిట్యూట్ తోపాటు డిపార్ట్ మెంట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అండ్ చులాలాంగ్ కార్న్ యూనివర్సిటీ వ్యాక్సిన్ రీసర్చ్ ఇన్ స్టిట్యూట్ తీవ్రంగా శ్రమిస్తున్నాయి.

Latest Updates